త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EHS | నిమ్స్‌లో ఉచితంగానే ఈహెచ్ఎస్ ఓపీ సేవ‌లు..

EHS | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవల్లో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (EHS) కింద హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో (NIMS) అవుట్‌ పేషెంట్‌ సేవలను ఉచితంగానే అందించనుంది.

G

Telangana | Published On Sep 5, 2026, 11.53 am IST

EHS | నిమ్స్‌లో ఉచితంగానే ఈహెచ్ఎస్ ఓపీ సేవ‌లు..
Advertisement

EHS | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవల్లో ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (EHS) కింద హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో (NIMS) అవుట్‌ పేషెంట్‌ సేవలను ఉచితంగానే అందించనుంది. ఈ మేర‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ (Damodara Rajanarsimha) నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవ్‌రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈహెచ్‌ఎస్‌ కొత్త నిబంధనల ప్రకారం నెట్‌వ‌ర్క్ హాస్పిట‌ళ్ల‌లో లబ్ధిదారులకు ఇన్‌పేషెంట్‌ సేవలు, వెల్‌నెస్‌ సెంటర్లలో (Wellness Centers) మాత్రమే ఓపీ సేవలను (OP Services) అందించాలి. అయితే ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌ సౌకర్యార్థం నిమ్స్‌ ఆసుపత్రిలో ఓపీ సేవలను యథావిధిగా ఉచితంగానే కొనసాగించాలన్నారు.

మరోవైపు ఉద్యోగుల‌కు వైద్య సేవ‌ల‌ను మ‌రింత చేరువ చేసేందుకు ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ది. ఇందులో భాగంగా కొత్త‌గా 24 వెల్‌నెస్ సెంట‌ర్ల‌ను మంజూరు చేసింది. వీటిలో హైద‌రాబాద్‌లోనే (Hyderabad) 3 కొత్త వెల్‌నెస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నుంది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 12 వెల్‌నెస్‌ సెంటర్లు అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. జనరల్ హాస్పిటళ్లకు అనుసంధానిస్తూ వెల్‌నెస్ సెంటర్లలోనూ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

Advertisement
Advertisement