త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IRCTC | అరుణాచ‌లం To రామేశ్వ‌రం.. రూ.16 వేల‌కే ఏడు ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నం

IRCTC | ద‌క్షిణ భార‌త‌దేశంలో ఏడు ప్ర‌ముఖ దివ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' పేరుతో ప్ర‌త్యేక టూర్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. రూ.15,800 నుంచే ప్యాకేజీ ధరలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల‌పాటూ ఈ యాత్ర సాగ‌నుంది.

D

National | Published On Sep 5, 2026, 11.36 am IST

IRCTC | అరుణాచ‌లం To రామేశ్వ‌రం.. రూ.16 వేల‌కే ఏడు ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల ద‌ర్శ‌నం
Advertisement

IRCTC | త్రినేత్ర‌.న్యూస్ : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను (Major Temples In South India) సంద‌ర్శించుకోవాల‌నుకునే యాత్రికుల‌కు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం' పేరుతో ప్ర‌త్యేక టూర్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ టూర్‌లో తిరువ‌ణ్ణామ‌లైలో అరుణాచ‌లం ఆల‌యం, చిదంబరంలోని నటరాజ ఆలయం, శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆల‌యాన్ని దర్శించుకునే అవకాశం క‌ల్పిస్తోంది.

అది కూడా చాలా త‌క్కువ ఖ‌ర్చుతో ఈ ప్యాకేజీని ప్ర‌క‌టించింది ఐఆర్‌సీటీసీ. రూ.15,800 నుంచే ప్యాకేజీ ధరలు ప్రారంభం కానున్నాయి. చిన్నారులకు ప్రత్యేక రాయితీ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల‌పాటూ సాగే ఈ యాత్ర అక్టోబ‌ర్ 6న హైద‌రాబాద్ సికింద్రాబాద్ నుంచి భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైలు (Bharat Gaurav Tourist Train)తో ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర‌లో భాగంగా కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, గాంధీ మండపం కూడా సందర్శిస్తారు.

ప్ర‌యాణం సాగుతుందిలా..

  • భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అక్టోబర్ 6న ఉదయం 7:55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. చ‌ర్ల‌ప‌ల్లి, జ‌న‌గాం, కాజీపేట్‌, వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, ఖ‌మ్మం, మ‌ధిర‌, విజ‌య‌వాడ‌, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్ర‌యాణం సాగుతుంది.
  • అక్టోబ‌ర్ 7న ఉద‌యం 8 గంట‌ల‌కు తిరువ‌ణ్ణామ‌లై చేరుకుంటారు. అక్క‌డ దిగిన వెంట‌నే హోట‌ల్ రూమ్‌కు వెళ్తారు. ఫ్రెష్ అయ్యాక అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి స్టే అరుణాచ‌లంలోనే.
  • అక్టోబ‌ర్ 8న ఉద‌యం లేవ‌గానే ఫ్రెష్ అవుతారు. హోట‌ల్ చెక్ అవుట్ చేసి రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి చిదంబ‌రం బ‌య‌ల్దేర‌తారు. మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు చిదంబ‌రం చేరుకుంటారు. అక్క‌డ న‌ట‌రాజ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఈ ఆల‌యం రైల్వే స్టేష‌న్‌కు కేవ‌లం 1.5 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంటుంది. కాలిన‌డ‌క‌న లేదా ఆటో రిక్లాలో వెళ్లాల్సి ఉంటుంది. ద‌ర్శ‌నానంత‌రం తిరిగి రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. రాత్రి 7 గంట‌ల‌కు రైల్లో తిరుచ్చిరాపల్లికి బ‌య‌ల్దేర‌తారు. రాత్రి 11 గంట‌ల‌కంతా తిరుచ్చిరాప‌ల్లికి చేరుకుంటారు. రాత్రి బ‌స అక్క‌డే ఉంటుంది.
  • అక్టోబ‌ర్ 9న ఉద‌యం లేవ‌గానే.. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయ సంద‌ర్శ‌న‌కు వెళ్తారు. ఆ త‌ర్వాత రోడ్డు మార్గంలో తంజావూరుకు బ‌య‌ల్దేర‌తారు. సుమారు 60 కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. అక్క‌డ బృహ‌దీశ్వ‌ర ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఆల‌య ద‌ర్శ‌నం పూర్తైన త‌ర్వాత తంజావూరు రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. రాత్రి 10:50కి రైల్లో రామేశ్వరం బ‌య‌ల్దేర‌తారు.
  • అక్టోబ‌ర్ 10వ తేదీన తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు రామేశ్వ‌రం రైల్వే స్టేష‌న్ చేరుకుంటారు. అక్క‌డ హోట్‌లో చెక్ ఇన్ అయ్యి.. ఫ్రెష్ అవుతారు. రామనాథస్వామి ఆలయం, స్థానిక ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తారు (లోక‌ల్ ట్రాన్స్‌పోర్ట్ యాత్రికులే భ‌రించుకోవాలి). రామేశ్వ‌రంలోనే రాత్రి బ‌స ఉంటుంది.
  • అక్టోబ‌ర్ 11న ఉద‌యం హోట‌ల్ చెక్ అవుట్ చేసి రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. ఉద‌యం 11 గంట‌ల‌కు రైల్లో మ‌ధురైకి బయ‌ల్దేర‌తారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మ‌ధురై రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటారు. అక్క‌డ మీనాక్షి అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం మ‌ళ్లీ రైల్వే స్టేష‌న్ చేరుకుంటారు. రాత్రి 11 గంట‌ల‌కు రైల్లో క‌న్యాకుమారికి బ‌య‌ల్దేర‌తారు.
  • అక్టోబ‌ర్ 12న తెల్ల‌వారుజామున 4:50 గంట‌లకు క‌న్యాకుమారి చేరుకుంటారు. అక్కడి నుండి హోట‌ల్‌కు వెళ్లి స్నానం చేసి రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శిస్తారు. ఇక్క‌డితో మీ యాత్ర పూర్త‌వుతుంది. అదేరోజు రాత్రి 10 గంట‌ల‌కు తిరురు ప‌య‌న‌మ‌వుతారు.
  • రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, చర్లపల్లి మీదుగా రైలు అక్టోబ‌ర్ 14 తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు దిగిన త‌ర్వాత యాత్రికులు త‌మ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లిపోతారు. దీంతో ఈ టూర్ పూర్త‌వుతుంది.

ప్యాకేజీ ధ‌ర‌ల విష‌యానికొస్తే..

  • ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ స్లీప‌ర్ క్లాస్‌, స్టాండర్డ్ (3ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) అనే మూడు రకాల ప్యాకేజీలను ప్రకటించింది.
  • స్లీపర్‌ క్లాస్‌లో ఎకానమీ టికెట్‌ ధర రూ.15,800 నుంచి ప్రారంభమవుతుంది. అదే 5-11 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు గ‌ల చిన్నారుల‌కు మాత్రం రూ.14,800 చెల్లించాలి.
  • 3ఏసీ స్టాండర్డ్‌ ప్యాకేజీ ధర రూ.23,200 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇందులో 5-11 ఏళ్ల మ‌ధ్య చిన్నారుల‌కు రూ.22,000 చెల్లించాలి.
  • ఇక‌ 2ఏసీ కంఫర్ట్‌ ప్యాకేజీ ధర రూ.29,600గా నిర్ణయించారు. ఇందులో 5-11 ఏళ్ల చిన్నారుల‌కు రూ.28,100 చెల్లించాలి.

ఇవీ సౌక‌ర్యాలు..

యాత్రికులకు హోటల్‌ బస, శాకాహార భోజనం, స్థానిక రవాణా, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, టూర్‌ మేనేజర్‌ సహాయం వంటి సదుపాయాలు ప్యాకేజీలో భాగం. అయితే, ఏ ఆల‌యం వ‌ద్దైనా ఎంట్రీ ఫీజులు ఉంటే మాత్రం ప్ర‌యాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవ‌లం యాత్రికుల భ‌ద్ర‌త‌, ప్ర‌యాణ స‌దుపారం, బ‌స‌, ఫుడ్ వంటివి మాత్ర‌మే రైల్వే సిబ్బంది చూసుకుంటారు. ఈ ప్రత్యేక దివ్య దక్షిణ యాత్ర కోసం మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 237 స్లీపర్ క్లాస్ సీట్లు, 416 3-ఏసీ సీట్లు, 52 2-ఏసీ సీట్లు ఉన్నాయి.

Also Read..

ఓపెన్‌ఏఐ నుంచి జీపీటీ-6 ఆస్ట్రా.. కంప్యూటర్‌ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త ఏఐ..

ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొల‌గించేందుకు కుట్ర‌.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్‌

ఒక్క రోజులోనే రూ.18వేలు త‌గ్గిన బంగారం ధ‌ర‌.. మ‌ళ్లీ ప‌త‌నం దిశ‌గా..?

Advertisement
Advertisement