Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
Nepal Floods | నేపాల్ వరదల్లో (Nepal Floods) అద్భుతం చోటు చేసుకుంది. విపత్తు సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత పూర్తిగా బురదతో కూరుకుపోయిన జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం (Hydropower Tunnel) నుంచి ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
International | Published On Sep 4, 2026, 11.21 am IST
Nepal Floods | త్రినేత్ర.న్యూస్ : నేపాల్ వరదల్లో (Nepal Floods) గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్ నిరంతరాయంగా గాలింపు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అక్కడ కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా అక్కడ ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. విపత్తు సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత ఇద్దరు కార్మికులు పూర్తిగా బురదతో కూరుకుపోయిన జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం (Hydropower Tunnel) నుంచి ప్రాణాలతో బయటపడటం విస్మయానికి గురిచేస్తోంది.
గత నెల 26న సంభవించిన ఆకస్మిక వరదలకు నేపాల్ సరిహద్దులోని అనేక ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రిశూలి ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. పెను వరదల ధాటికి త్రిశూలి ప్రాజెక్ట్‌లోకి (Trishuli 3A Hydropower Project) భారీగా నీరు, బురద, బండరాళ్లు దూసుకొచ్చాయి. దీంతో సొరంగం ద్వారం పూర్తిగా మూసుకుపోయింది. ఫలితంగా వందలాది మంది కార్మికులు, ఇంజనీర్లు లోపలే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సహాయ చర్యల్లో భాగంగా రెస్క్యూ సిబ్బంది జలవిద్యుత్ కేంద్రం వద్ద సంచరిస్తుండగా.. వారికి లోపలి నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరిని సజీవంగా బయటకు తీశారు. ప్రాణాలతో బయటపడిన కార్మికులను 45 ఏళ్ల కబీర్ మహర్జన్, 30 ఏళ్ల సంజయ్ షాగా గుర్తించినట్లు నేపాల్ హోం మంత్రి సుడాన్ గురుంగ్ తెలిపారు.
షా నేపాల్ విద్యుత్ అథారిటీలో మెకానికల్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తుండగా.. మహర్జన్ త్రిశూలి-3 ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆహారం, నీటి మాట పక్కనపెడితే, కనీసం గాలి కూడా దూరని బురదతో కూరుకుపోయిన సొరంగం నుంచి కార్మికులు ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి. ఇంకా ఎవరైనా లోపల చిక్కుకుపోయారేమోనని అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు.

1,282 మంది మృతి
గత నెల సంభవించిన వరదలు నేపాల్ సరిహద్దు పట్టణాలు, లోయలను అతలాకుతలం చేశాయి. వరద విధ్వంసానికి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు, వాహనాలు, రోడ్లు, మార్కెట్లు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఈ వరదల ధాటికి ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 1,282కు చేరింది. 4,800 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. వీరిలో భారతీయులు, ఇతర విదేశీయులు ఉన్నారు.
त्रिशूली-3A मा जलविद्युत् आयोजनाको सुरुङभित्रबाट दुई जना व्यक्तिको जिवितै उद्धार #NepaliArmy #नेपालीसेना #BhotekoshiFlood pic.twitter.com/PLiOsN7KjM
— Nepali Army (@NepaliArmyHQ) September 4, 2026
Also Read..
ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
- ●Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..
- ●IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన
- ●SIR | ముసాయిదా ఓటర్ల జాబితా.. కాంగ్రెస్ ఎంపీ పేరు మాయం
- ●Stock Markets | 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 23,900 పైన నిఫ్టీ..
- ●Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..

Volkswagen | వోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు.. 2030 నాటికి లక్ష ఉద్యోగాలు కట్..

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

SIR | ముసాయిదా ఓటర్ల జాబితా.. కాంగ్రెస్ ఎంపీ పేరు మాయం






