త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaishnavi Chaitanya | నీ పేరు ఎవ‌రికి తెలియ‌ద‌ని అవ‌మానించారు – వైష్ణ‌వి చైత‌న్య ఎమోష‌న‌ల్ కామెంట్స్‌

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించిన ఎపిక్ మూవీ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఈ వేడుక‌లో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సినిమా క‌ష్టాల‌ను గుర్తుచేసుకుంటూ హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య ఎమోష‌న‌ల్ అయ్యింది.

N

Entertainment | Published On Sep 5, 2026, 11.56 am IST

Vaishnavi Chaitanya | నీ పేరు ఎవ‌రికి తెలియ‌ద‌ని అవ‌మానించారు – వైష్ణ‌వి చైత‌న్య ఎమోష‌న‌ల్ కామెంట్స్‌
Advertisement

Vaishnavi Chaitanya | కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న క‌ష్టాల‌ను గుర్తుచేసుకొని అచ్చ తెలుగు హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య ఎమోష‌న‌ల్ అయ్యింది. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన ఎపిక్ మూవీ సెప్టెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఎపిక్ మూవీ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఛీప్ గెస్ట్‌గా హాజ‌రైంది.

నువ్వు ఎవ‌రికైనా తెలుసా....

ఈ వేడుక‌లో కెరీర్ తొలినాళ్ల‌లో తాను ఎదుర్కొన్న క‌ష్టాల‌ను బ‌య‌ట‌పెట్టింది వైష్ణ‌వి చైత‌న్య‌. సినిమాల ఆడిష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు నీ పేరు ఎవ‌రికి తెలియ‌ద‌ని అవ‌మానించేవార‌ని అన్న‌ది. "నిన్ను ఎవ‌రైనా గుర్తుప‌డ‌తారా, నువ్వు ఎవ‌రికైనా తెలుసా అంటూ అడిగేవారు. ఇంట‌ర్‌నెట్‌లో నీ పేరు టైప్ చేస్తే ఏమైనా ఇన్ఫ‌ర్మేష‌న్ వ‌స్తుందా అంటూ చుల‌క‌న‌గా మాట్లాడేవారు. అస‌లు నీ పేరే ఎవ‌రికి తెలియ‌ద‌ని ఛాన్స్‌ల‌ను రిజెక్ట్ చేసేవారు. ఇలాంటి అనుభ‌వాలు చాలా సార్లు ఎదుర‌య్యాయి. ఆ మాట‌లు చాలా బాధ‌పెట్టేవి. కానీ అవ‌న్నీ స‌హ‌జ‌మ‌ని నాకు నేను స‌ర్ధిచెప్పుకుంటూ ముందుకు సాగా. ఇప్పుడు గూగుల్‌లో వైష్ణ‌వి చైత‌న్య అని టైప్ చేస్తే నా జ‌ర్నీ, సినిమాల గురించిన స‌మాచారం బోలెడు క‌నిపిస్తుంది. ఇదే నేను సాధించిన స‌క్సెస్‌గా భావిస్తున్నా" అంటూ ఎమోష‌న‌ల్ అయ్యింది. ఆమె కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి.

బేబీ త‌ర్వాత‌...

బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య ఎపిక్‌లో మ‌రోసారి జంట‌గా క‌నిపించ‌బోతున్నారు. లండ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు. ఆనంద్ . వైష్ణ‌వి కెమిస్ట్రీ,  బోల్డ్ సీన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ సినిమా ప్రీమియ‌ర్స్‌ను వేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

 

Advertisement
Advertisement