త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొల‌గించేందుకు కుట్ర‌.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్‌

Revanth Reddy | ఎస్ఐఆర్ (SIR) పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్న‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమ‌ర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారని, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారని చెప్పారు.

G

Telangana | Published On Sep 5, 2026, 11.22 am IST

Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొల‌గించేందుకు కుట్ర‌.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: ఎస్ఐఆర్ (SIR) పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్న‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమ‌ర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారని, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారని చెప్పారు. తెలంగాణలోనూ (Telangana) అదేవిధంగా గెలవాలని బీజేపీ (BJP) ప్రయత్నిస్తున్న‌ద‌ని ఆరోపించారు. తెలంగాణలో దొంగదెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరని స్ప‌ష్టం చేశారు. ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోర‌ని హెచ్చ‌రించారు. కొడంగ‌ల్‌లోని త‌న నివాసంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, స్థానిక నాయ‌కుల‌తో సీఎం రేవంత్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల ఓట్లను బీజేపీ టార్గెట్ చేసింద‌ని వెల్ల‌డించారు. ఇంతకుముందు ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవార‌ని, కానీ ఇప్పుడు ఓట్ల తొలగింపుతో తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారని విమ‌ర్శించారు. చిన్న తప్పిదాలను సాకుగా చూపి పేదల ఓట్లను తొలగించేంందుకు బీజేపీ కుట్ర చేస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెన్‌ను (Congress) ఓడించేందుకు ఈ కుట్రకు బీఆరెస్ కూడా బీజేపీకి (BRS) మద్దతు ఇస్తున్న‌ద‌ని చెప్పారు. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మ‌నంద‌రిపై ఉందని వెల్ల‌డించారు. ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉందని తెలిపారు.

గ్రామాల వారీగా బీఎల్ఏలను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాలని సూచించారు. ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత మండల నాయకులదేన‌ని స్ప‌ష్టం చేశారు. ప్రతీ ఒక్కరు 4 గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతీ బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత తీసుకోవాల‌ని చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉండాల‌ని.. బీజేపీ, బీఆరెస్ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కొడంగల్ ప్రజలు త‌న‌ను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు (Kodangal) ఈ గుర్తింపు, గౌరవం వచ్చిందని చెప్పారు.

Advertisement
Advertisement