GPT-6 Astra | ఓపెన్‌ఏఐ నుంచి జీపీటీ-6 ఆస్ట్రా.. కంప్యూటర్‌ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త ఏఐ..
GPT-6 Astra | ఓపెన్‌ఏఐ కొత్త ఏఐ మోడల్ జీపీటీ-6 ఆస్ట్రాని లాంచ్ చేసింది. ప్రీ-ట్రైనింగ్, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, అలైన్‌మెంట్‌పై జరిగిన పరిశోధనల ఆధారంగా ఈ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది. తొలుత ఎంపిక చేసిన పరిమిత సంఖ్యలో సంస్థలకు ఇది అందుబాటులోకి వస్తుండగా, రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Technology | Published On Sep 5, 2026, 11.25 am IST
GPT-6 Astra | ఓపెన్‌ఏఐ కొత్త ఏఐ మోడల్ జీపీటీ-6 ఆస్ట్రాని లాంచ్ చేసింది. ప్రీ-ట్రైనింగ్, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, అలైన్‌మెంట్‌పై జరిగిన పరిశోధనల ఆధారంగా ఈ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది. తొలుత ఎంపిక చేసిన పరిమిత సంఖ్యలో సంస్థలకు ఇది అందుబాటులోకి వస్తుండగా, రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. జీపీటీ-6 ఆస్ట్రా కంప్యూటర్లు, వెబ్‌సైట్లపై వివిధ పనులను స్వయంగా నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ ఫామ్‌లను నింపడం, సీఆర్‌ఎం రికార్డులను అప్‌డేట్ చేయడం, క్యాలెండర్‌లను నిర్వహించడం, ఆన్‌లైన్ పరిశోధన చేయడం, ఈ-మెయిల్, డాక్యుమెంట్ సారాంశాలను సిద్ధం చేయడం వంటి పనులు చేస్తుంది. అలాగే శాస్త్రీయ డేటాను విశ్లేషించి గ్రాఫ్‌లను రూపొందించడం, వెబ్‌సైట్లను తయారు చేయడం, ఫ్రంట్‌ఎండ్ క్యూఏ తనిఖీలు నిర్వహించడం, సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి పరీక్షించడం, తెరపై కనిపించే సమస్యలను గుర్తించి పరిష్కరించడం కూడా చేస్తుంది.
వేగవంతంగా అనేక పనులు..
సర్క్యూట్ బోర్డులు, ఎక్సెల్ పోటీలు, గేమ్ డెవలప్‌మెంట్, ఫామ్ 1040 పూర్తి చేయడం, ఫ్రంట్‌ఎండ్ క్యూఏ, పవర్ బీఐ, కార్ ట్రాన్స్‌మిషన్లు, లీగల్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ వంటి విభిన్న పనులపై ఓపెన్‌ఏఐ ఆస్ట్రాను పరీక్షించింది. రోజువారీ పనుల్లో పిల్లల వైద్యుడి కోసం వెతకడం, అపార్ట్‌మెంట్ కోసం అన్వేషించడం, డీఎంవీ అపాయింట్‌మెంట్ తీసుకోవడం, తక్కువ కార్బొహైడ్రేట్లు ఉన్న స్నాక్స్‌ను కనుగొనడం, కిండర్‌గార్టెన్ ఎంపికలను విశ్లేషించడం వంటి పనులను కూడా ఆస్ట్రా నిర్వహిస్తుంది. అలాగే అవసరాలు మారినప్పుడు కూడా ఆస్ట్రా తన పనిని మార్చుకుంటుంది. మధ్యలో అడిగే ఇతర ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ప్రధాన పనిని మర్చిపోకుండా కొనసాగిస్తుంది. వెబ్‌సైట్లు, గేమ్‌లు, అప్లికేషన్లు, రెండరింగ్‌లను పరిశీలించేటప్పుడు విజువల్ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది. చాట్‌జీపిటీలోని సైట్స్ ద్వారా ఒకే ప్రాంప్ట్‌తో వెబ్‌సైట్లు, వెబ్‌యాప్‌లు, గేమ్‌లను రూపొందించి, హోస్ట్ చేసి, షేర్ చేయవచ్చని ఓపెన్‌ఏఐ తెలిపింది.
ధర ఎంత..
స్టాండర్డ్ వినియోగంలో ఇన్‌పుట్‌కు ప్రతి 10 లక్షల టోకెన్లకు 10 డాలర్లు, అవుట్‌పుట్‌కు ప్రతి 10 లక్షల టోకెన్లకు 50 డాలర్లు చార్జ్ ఉంటుంది. ఫాస్ట్ మోడ్‌లో స్టాండర్డ్ ధరకు రెండింతలు చెల్లించాలి. ప్రాసెసింగ్ వేగం మాత్రం గరిష్ఠంగా రెండు రెట్లు ఉంటుంది. క్యాష్ రీడ్స్, క్యాష్ రైట్స్‌కు ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి. ఏపీఐ మోడల్ ఐడీ జీపీటీ-6-ఆస్ట్రా అమెజాన్ బెడ్‌రాక్ ద్వారా కూడా అందుబాటులో ఉంది. జీపీటీ-6 ఆస్ట్రాను తొలుత పరిమిత సంఖ్యలో సంస్థలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆ తర్వాతి దశలో చాట్‌జీపీటీ ప్లస్, ప్రొ, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు రానున్న రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓపెన్‌ఏఐ ఏపీఐతోపాటు ఏడబ్ల్యూఎస్ ద్వారా కూడా దీనిని ఉపయోగించవచ్చు.
ఎవరికి అందుబాటులో..
ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్ వినియోగ పరిమితుల్లోనే ఆస్ట్రా వినియోగాన్ని చేరుస్తారు. అదనపు వినియోగం కోసం అదనపు క్రెడిట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆస్ట్రా ప్రొ వెర్షన్ ప్రొ, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఎంటర్‌ప్రైజ్ నిర్వాహకులు ప్రారంభ సమయంలో డిఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉన్న ఆస్ట్రా యాక్సెస్‌ను అవసరమైతే ఎనేబుల్ చేయవచ్చు. అర్హత ఉన్న ఏపీఐ కస్టమర్లకు జీరో డేటా రిటెన్షన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కస్టమర్ల గోప్యతను కాపాడుతూనే సేఫ్టీ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రైవేట్ సేఫ్టీ ప్రాసెసింగ్‌ను కూడా ఓపెన్‌ఏఐ పరీక్షిస్తోంది.
తాజావార్తలు
- ●IRCTC | అరుణాచలం To రామేశ్వరం.. రూ.16 వేలకే ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం
- ●Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్ర.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. మళ్లీ పతనం దిశగా..?
- ●టీ గ్లాసులో ‘యాంటిడోట్’: హెర్బల్ టీల కాలం చెల్లింది.. ఇప్పుడు ‘ఫంక్షనల్ డ్రింక్స్’ హవా!
- ●Mutual Fund SIP | నెలకు రూ.25వేల సిప్ కడితే 10, 20, 30 ఏళ్లలో ఎంత జమ అవుతుంది..?
- ●Woman Kidnapped | దారుణం.. తీసుకున్న అప్పు కట్టలేదని.. మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా వీడియో తీసి

IRCTC | అరుణాచలం To రామేశ్వరం.. రూ.16 వేలకే ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం

Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్ర.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. మళ్లీ పతనం దిశగా..?

టీ గ్లాసులో ‘యాంటిడోట్’: హెర్బల్ టీల కాలం చెల్లింది.. ఇప్పుడు ‘ఫంక్షనల్ డ్రింక్స్’ హవా!






