త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Baby bottle gourds | సొర‌కాయ‌ల వ్యాపారం.. రోజుకు రూ. 50,000 సంపాద‌న‌..

Baby bottle gourds | నీటి శాతంతో పాటు ఫైబ‌ర్ అధికంగా ఉండే కూర‌గాయ ఏదైనా ఉందా..? అంటే అది సొర‌కాయ‌( Bottle Gourds )నే చెప్పొచ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఈ సొర‌కాయ‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌మ మెనూలో భాగం చేసుకుంటారు. అయితే లేత సొర‌కాయ‌కు భారీగా డిమాండ్ ఉంటుంది. అలాంటి బేబి సొర‌కాయ‌ల‌ను( Baby bottle gourds ) సాగు చేస్తూ క‌ర్ణాట‌క‌( Karnataka ) కు చెందిన క‌రీగౌడ‌( Karigowda ).. రోజుకు రూ. 50,000లు సంపాదిస్తున్నాడు. అంటే ఒక్క సీజ‌న్‌లో అత‌ని ఆదాయం వ‌చ్చేసి రూ. 45 ల‌క్ష‌లు. మ‌రి క‌రీగౌడ స‌క్సెస్ స్టోరీ ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

S

Agriculture | Published On Oct 27, 2026, 6.38 pm IST

Baby bottle gourds | సొర‌కాయ‌ల వ్యాపారం.. రోజుకు రూ. 50,000 సంపాద‌న‌..
Advertisement

Baby bottle gourds | త్రినేత్ర న్యూస్ : క‌ర్ణాట‌క‌( Karnataka )లోని బెంగ‌ళూరు అర్బ‌న్ జిల్లా అది. కార్ల‌పురా పాళ్యాకు చెందిన క‌రీగౌడ( Karigowda ) త‌న‌ వ్య‌వ‌సాయ క్షేత్రంలో సొర‌కాయ‌ల సాగు చేస్తుంటాడు. అదేదో మ‌న మార్కెట్ల‌లో ల‌భ్య‌మ‌య్యే పొడ‌వాటి సొర‌కాయ‌లను( Bottle Gourds ) అస‌లే పండించ‌డు. కేవ‌లం పొట్టిగా ఉండే.. 500 గ్రాముల వ‌ర‌కు బరువు ఉండే సొర‌కాయ‌ల‌ను మాత్ర‌మే పండిస్తాడు. అది కూడా మ‌న మార్కెట్ల‌లో అస‌లు విక్ర‌యించ‌డు. గ‌ల్ఫ్ దేశ‌మైన ఖ‌తార్‌( Qatar )కు ఆ బేబి సొర‌కాయ‌ల‌ను( Baby bottle gourds ) ఎగుమ‌తి చేస్తాడు.

డిగ్రీ పూర్త‌య్యాక‌.. పై చ‌దువుల‌కు వెళ్ల‌కుండా..

ఇక క‌రీగౌడ కుటుంబం వ్య‌వ‌సాయ కుటుంబ‌మే. అత‌ని తాత‌, నాన్న‌లు కూడా రైతులే. ఆయ‌న డిగ్రీ పూర్త‌య్యాక‌.. పై చ‌దువుల‌కు వెళ్ల‌కుండా.. వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మైపోయాడు. అయితే మొద‌ట మొక్క‌జొన్న‌, ట‌మాటా, వంకాయ వంటి కూర‌గాయ‌ల‌ను సాగు చేసేవారు. కానీ ఆదాయం అంతంత మాత్ర‌మే. దీంతో కొత్త పంట‌ల‌పై దృష్టి సారించాడు. బాగా దిగుబ‌డి వ‌చ్చే కూర‌గాయల‌ను పండించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు క‌రీగౌడ‌.

అనుకున్న‌దే ఆల‌స్యం.. బేబి సొర‌కాయ సాగు

ఈ క్ర‌మంలోనే బేబి సొర‌కాయ గురించి ఆయ‌న విన్నాడు. విదేశాల్లో ఈ సొర‌కాయ‌ల‌కు బాగా డిమాండ్ ఉంద‌ని తెలుసుకున్నాడు. ఇక అనుకున్న‌దే ఆల‌స్యం.. బేబి సొర‌కాయ సాగు ప్రారంభించాడు. దిగుబ‌డి కూడా బాగానే ఉంది. బ్రోక‌ర్లు ఫామ్ వ‌ద్ద‌కే చేరుకుని సొర‌కాయ‌ల‌ను కొనుగోలు చేసి ఖ‌తార్‌కు ఎగుమ‌తి చేయ‌డం ప్రారంభించారు. కొనుగోలుదారుల‌ను దృష్టిలో ఉంచుకుని సాగు చేసి.. త‌క్కువ కాలంలోనే భారీ లాభాలు గ‌డించాడు క‌రీగౌడ‌.

70 రోజుల త‌ర్వాత తొలి పంట చేతికి

ప్ర‌స్తుతం త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో స్విక‌ర్ 045 ఎఫ్‌1 ర‌కానికి చెందిన సొర‌కాయ‌ల‌ను సాగు చేస్తున్నాడు. జూన్ - జులై మాసంలో సాగు ప్రారంభిస్తే.. 70 రోజుల త‌ర్వాత తొలి పంట చేతికి అందుతుంది. అంటే సెప్టెంబ‌ర్ నాటికి సొర‌కాయ‌లు దిగుమ‌తి అవుతాయి. పంట కోత సెప్టెంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు కొనసాగుతుంద‌ని క‌రీగౌడ్ పేర్కొన్నాడు.

ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలోనే సాగు

ఇక సొర‌కాయ‌తో పాటు టమాటా, వంకాయ కూడా సాగు చేస్తున్నాడు. ఈ రెండు కూర‌గాయ‌ల‌ను స్థానిక మార్కెట్ల‌తో పాటు త‌మిళ‌నాడుకు ఎగుమ‌తి చేస్తున్నాడు. కిలో వంకాయ‌ను రూ. 45కు విక్ర‌యిస్తున్న‌ట్లు తెలిపాడు. అయితే అన్ని కూర‌గాయ‌ల‌ను కూడా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలోనే సాగు చేస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇందుకు ఆవుపేడ‌, వేప కొమ్మ‌ల‌తో పాటు డీఏపీ ఫెర్టిలైజ‌ర్‌ను ఉప‌యోగిస్తున్నాడు క‌రీగౌడ‌.

నెల‌కు రూ. 14 ల‌క్ష‌ల‌ నుంచి రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం

ఇటీవ‌లి సీజ‌న్‌లో 3.5 ఎక‌రాల్లో సొర‌కాయ‌ల‌ను పండించాడు. రోజుకు ఒక ట‌న్ను వ‌ర‌కు దిగుబ‌డి సాధించాడు. కేజీ సొర‌కాయ‌ల‌ను రూ. 50కి విక్ర‌యించాడు. అంటే రోజుకు రూ. 50,000 వ‌ర‌కు సంపాదించాడు. నెల‌కు రూ. 14 ల‌క్ష‌ల‌ నుంచి రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం గ‌డించాడు. 90 రోజుల పంట కాలంలో మొత్తం ఆదాయం రూ. 45 ల‌క్ష‌లు సంపాదించిన‌ట్లు క‌రీగౌడ తెలిపాడు.

Advertisement
Advertisement