త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DTO | ఏకంగా డీటీవోను చంపేశారు..

DTO | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో దారుణం చోటుచేసుకున్న‌ది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా ర‌వాణా అధికారి (DTO)పైకి లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు.

G

Telangana | Published On Jun 22, 2026, 10.56 am IST

DTO | ఏకంగా డీటీవోను చంపేశారు..
Advertisement

DTO | త్రినేత్ర‌.న్యూస్‌: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో దారుణం చోటుచేసుకున్న‌ది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా ర‌వాణా అధికారి (DTO)పైకి లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు.

విధుల్లో భాగంగా డీటీవో వెంన్న.. చెల్పూరులోని జిల్లా ర‌వాణా కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్ర‌మంలో అటుగా వ‌చ్చిన‌ ఓ లారీని ఆపేందుకు ప్ర‌య‌త్నించ‌గా, డ్రైవర్ అలాగే వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో లారీ వెంకన్నపై నుంచి దూసుకెళ్లింది.

తీవ్ర గాయాలైన డీటీవోను స‌హ‌చ‌ర సిబ్బంది స్థానిక ద‌వాఖాన‌కు తరలిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద్యర్యాప్తు చేప‌ట్టారు. ఇది ప్ర‌మాదమా? లేదా కావాల‌నే అధికారిని ఢీకొట్టి చంపేశారా? అనే కోణంలో విచార‌ణ చేస్తున్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన లారీ డ్రైవ‌ర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కాగా, డీటీవో వెంక‌న్న 15 రోజుల క్రిత‌మే బ‌దిలీపై భూపాల‌ప‌ల్లి జిల్లాకు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement