Bill Gates | కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐకి ఇవ్వొద్దు.. బిల్ గేట్స్ హెచ్చరిక..
Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ, రోబోటిక్స్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే కొన్ని రంగాల్లోని ఉద్యోగాలను పూర్తిగా ఏఐకి అప్పగించకుండా, వాటిని కేవలం మనుషులే చేసేలా ప్రత్యేకంగా రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
International | Published On Aug 27, 2026, 10.50 am IST
Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ, రోబోటిక్స్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే కొన్ని రంగాల్లోని ఉద్యోగాలను పూర్తిగా ఏఐకి అప్పగించకుండా, వాటిని కేవలం మనుషులే చేసేలా ప్రత్యేకంగా రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ది టర్బ్యులెంట్ ఏఐ ఎరా ఈజ్ హియర్, ది చాయిసెస్ వి మేక్ ఆర్ క్రిటికల్ పేరుతో సుమారు 6వేల పదాల వ్యాసాన్ని బిల్ గేట్స్ రాశారు. మూడేళ్ల తర్వాత ఏఐపై ఆయన రాసిన తొలి సుదీర్ఘ వ్యాసంగా ఇది నిలిచింది. ఏఐ వల్ల ఉద్యోగాల్లో వచ్చే మార్పులను వివరిస్తూ, కొన్ని పనులను మనుషుల కోసం ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరాన్ని ఆయన ప్రకృతి సంరక్షణ ప్రాంతాలతో పోల్చారు.
ఉదాహరణ చెప్పిన గేట్స్..
చాలా ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగవుతాయని గేట్స్ అన్నారు. ఏఐ, రోబోట్లు మరింత అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని పనులను కేవలం మనుషులే చేసేలా ప్రత్యేకంగా కేటాయిస్తారని తాను భావిస్తున్నానని గేట్స్ పేర్కొన్నారు. ఈ విధానాన్ని తాను హ్యూమన్ రిజర్వ్డ్ అని పిలుస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి రిజర్వ్‌ల మాదిరిగానే, అక్కడ భవనాలు, రహదారులు నిర్మించగలిగినా పర్యావరణానికి జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని భావించి వాటిని నిర్మించకుండా వదిలేస్తామని, అదే విధంగా మానవత్వం కోల్పోయే ప్రమాదం ఉన్న కొన్ని పనులను ఏఐకి అప్పగించకూడదని ఆయన వివరించారు. ఈ విషయంలో తన తండ్రికి అల్జీమర్స్ వ్యాధి ఉన్న సమయంలో వైద్య, సంరక్షణ నిపుణులు అందించిన సేవలను గేట్స్ ఉదాహరణగా ప్రస్తావించారు. తన తండ్రి ఆరు సంవత్సరాల క్రితం మరణించారని, ఆయనకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందించిన సంరక్షణలో పూర్తిగా మానవీయమైన అంశం ఉందని చెప్పారు. దాన్ని ఏ రోబోట్ కూడా భర్తీ చేయలేదని, చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ విభాగాలను మనుషులకే ఇవ్వాలి..
నయం చేయలేని వ్యాధి ఉన్నట్లు ఒక రోగికి చెప్పే బాధ్యతను రోబోట్ నిర్వహించగలిగే సాంకేతిక సామర్థ్యం భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందని గేట్స్ అన్నారు. అయితే అలాంటి విషాదకరమైన విషయాన్ని రోగికి చెప్పే బాధ్యత మాత్రం రోబోట్‌కు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మానవ అనుభూతి, సానుభూతి, భావోద్వేగ అవగాహన అవసరమయ్యే రంగాలను హ్యూమన్ రిజర్వ్డ్ విభాగంలో ఉంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇదే సమయంలో ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రభుత్వాలు ఇప్పటికీ తగినంతగా సిద్ధంగా లేవని బిల్ గేట్స్ హెచ్చరించారు. ఏఐతో వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి దేశీయంగా, అంతర్జాతీయంగా ఒక సమగ్ర వ్యవస్థను రూపొందించడం అత్యంత ప్రాధాన్యమైన పని అని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లోనూ ఏఐ వస్తోంది..
అమెరికాలో 9/11 దాడుల తర్వాత జాతీయ భద్రతను మెరుగుపరిచేందుకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ జరిగిందని గేట్స్ గుర్తుచేశారు. అయితే ఏఐ ప్రభావం జాతీయ భద్రతకే పరిమితం కాదని, ఉపాధి, విద్య, పన్నులు, ఇంధనం, ఎన్నికలు, గాలి, నీరు, ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థ, చట్ట అమలు, రవాణా, ప్రభుత్వ భూములు, సమాచార సాంకేతిక వ్యవస్థలు సహా అనేక రంగాలపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ కారణంగా ఏర్పడే ఈ భారీ మార్పులను ఎదుర్కొనేందుకు అవసరమైన కొత్త వ్యవస్థలను రూపొందించి అమలు చేసే సామర్థ్యం ప్రస్తుత ప్రపంచ సంస్థలకు ఉందా అనే ప్రశ్న తలెత్తుతోందని పేర్కొన్నారు. ఏఐ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా సమన్వయం అవసరమని, ఇందులో అమెరికా, చైనా మధ్య కూడా కొంత సహకారం అవసరమవుతుందని గేట్స్ అన్నారు. ఏఐ వల్ల పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంతర్జాతీయ ప్రయత్నాలపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించేందుకు నవంబర్‌లో సమావేశం ఏర్పాటు చేయడానికి తన సిబ్బంది ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.
ఏఐ వల్ల జ్ఞానం తగ్గే ప్రమాదం..
బిల్ గేట్స్ చివరిసారిగా షీ జిన్‌పింగ్‌ను మూడు సంవత్సరాల క్రితం కలిశారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి తర్వాత చైనా అధ్యక్షుడు ఆతిథ్యం ఇచ్చిన తొలి విదేశీ వ్యాపారవేత్తగా అప్పుడు గేట్స్ నిలిచారు. విద్యారంగంపై ఏఐ ప్రభావం గురించి కూడా గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వల్ల ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, అదే సాంకేతికత కారణంగా చాలామంది తక్కువగా నేర్చుకునే ప్రమాదం కూడా ఉందని ఆయన అన్నారు. ఏఐ వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని సూచించిన ఒక ప్రాథమిక సర్వేను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా యువతలో ఈ ప్రభావం మరింత బలంగా ఉన్నట్లు ఆ అధ్యయనం సూచించిందని గేట్స్ తెలిపారు. ఏఐ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ వ్యవస్థలను వేగంగా మార్చే సమయంలో మానవ విలువలు, మానవ సంబంధాలు, నిర్ణయ సామర్థ్యాలను కాపాడుకోవడం అత్యంత కీలకమని బిల్ గేట్స్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
- ●RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆంధ్ర న్యూస్ చానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Revanth Reddy | మీరాలం చెరువు అభివృద్ధి పనులను అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు.. చమురు ధరలే కీలకం..
- ●Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం
- ●TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్
- ●GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత

RS Praveen Kumar | రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. ఆంధ్ర న్యూస్ చానళ్లకు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Revanth Reddy | మీరాలం చెరువు అభివృద్ధి పనులను అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు.. చమురు ధరలే కీలకం..

Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం






