త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..?

Infinix GT 50 Pro | మొబైల్ గేమింగ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్, 144 హెడ్జ్ డిస్‌ప్లే, ప్రత్యేక గేమింగ్ ట్రిగ్గర్లు, లిక్విడ్ కూలింగ్ వ్యవస్థ, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.69,999గా నిర్ణయించారు.

S

Technology | Published On Oct 27, 2026, 5.25 pm IST

Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..?
Advertisement

Infinix GT 50 Pro | మొబైల్ గేమింగ్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్, 144 హెడ్జ్ డిస్‌ప్లే, ప్రత్యేక గేమింగ్ ట్రిగ్గర్లు, లిక్విడ్ కూలింగ్ వ్యవస్థ, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.69,999గా నిర్ణయించారు.

గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఇన్ఫినిక్స్ కొత్త జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ కొత్త జీటీ ఎకోసిస్టమ్‌లో ప్రాథమిక పరికరంగా రూపొందించిన ఈ ఫోన్‌లో భౌతిక గేమింగ్ నియంత్రణలు, అధునాతన శీతలీకరణ సాంకేతికత, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఇందులో 4 నానోమీటర్ టెక్నాలజీతో రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 3.25 గిగాహెడ్జ్‌ వేగంతో పనిచేస్తుంది. మీడియాటెక్ ఫ్రేమ్ రేట్ కన్వర్టర్ సాంకేతికత గ్రాఫిక్స్ ఫ్రేమ్‌లను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఆన్‌లైన్ గేమింగ్ సమయంలో నెట్‌వర్క్ ఆలస్యాన్ని తగ్గించి, సిగ్నల్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక ఎన్1 నెట్‌వర్క్ చిప్‌ను కూడా అందించారు.

గేమింగ్, డిస్‌ప్లే, కెమెరా ప్రత్యేకతలు..

ఈ ఫోన్‌లో ఓపెన్-కట్ ప్రెషర్-సెన్స్ జీటీ ట్రిగ్గర్ వ్యవస్థ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రెండు మెకానికల్ షోల్డర్ బటన్ల ద్వారా తేలికపాటి, బలమైన ప్రెస్‌లతోపాటు స్లైడింగ్ ఇన్‌పుట్‌లను ఉపయోగించవచ్చు. ఒక్కో ట్రిగ్గర్‌కు నాలుగు మ్యాపింగ్ పాయింట్ల వరకు కేటాయించడంతోపాటు పది స్థాయిల్లో ప్రెషర్ సెన్సిటివిటీని సర్దుబాటు చేసుకోవచ్చు. గేమింగ్‌తోపాటు స్క్రీన్‌షాట్‌లు, స్క్రీన్ రికార్డింగ్, మెమరీ క్లీనప్, ఫోలాక్స్ ఏఐ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా వీటితో యాక్టివేట్ చేయవచ్చు. ఫోన్‌లో అంతర్గత లిక్విడ్ కూలింగ్ ప్రవాహాన్ని చూపించే పారదర్శక పైప్‌లైన్ విండో డిస్‌ప్లేతో పాటు 14 లైటింగ్ సన్నివేశాలు, ఎనిమిది రంగులతో కస్టమైజ్ చేసుకునే మెకానికల్ లైట్ వేవ్స్ ఆర్‌జీబీ లైటింగ్ వ్యవస్థ ఉంది. వేడిని తగ్గించేందుకు 6,437 చదరపు మిల్లీమీటర్ల డయాఫ్రాగమ్‌తో కూడిన హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్‌ను అందించారు. పైజోఎలక్ట్రిక్ సిరామిక్ హీట్ పంప్ నిమిషానికి 6.5 మిల్లీలీటర్ల వేగంతో కూలెంట్‌ను ప్రసారం చేస్తుంది.

అదనంగా, ఐచ్ఛిక జీటీ మాగ్‌చార్జ్ కూలర్ 2.0లో 12 వాట్ల థర్మోఎలక్ట్రిక్ కూలింగ్, వైర్‌లెస్ బైపాస్ ఛార్జింగ్ సదుపాయాలున్నాయి. 6.78 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్‌ప్లే 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఓఐఎస్, ఈఐఎస్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఏఐ రా అల్గారిథమ్ ఇమేజ్ ప్రాసెసింగ్, రంగుల కచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్ 16తో పనిచేసే ఈ ఫోన్‌లో హార్డ్‌కోర్ ఈస్పోర్ట్స్ మోడ్, నోటిఫికేషన్ల నియంత్రణ, సిస్టమ్ జెశ్చర్ల పరిమితి వంటి గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి.

భారీ బ్యాట‌రీ, ఏఐ ఫీచ‌ర్లు..

ఏఐ స్మార్ట్ ట్రిగ్గర్, ఏఐ వాయిస్ ప్రాంప్ట్, ఏఐ మ్యాజిక్ వాయిస్ ఛేంజర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మూడు సంవత్సరాల వ‌ర‌కు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 30 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్, 10 వాట్ల రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, 5జి, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ సదుపాయాలను కూడా అందించారు. బ్లాక్ అబిస్, రెడ్ బ్లేజ్ రంగుల్లో లభించే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 30 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

బ్యాంకు ఆఫ‌ర్లు సైతం..

కొనుగోలుదారులకు రూ.24,999 విలువైన జీటీ 50 ప్రొ గేమింగ్ ఎకోసిస్టమ్ బండిల్‌ను ఉచితంగా అందించనున్నారు. ఇందులో జీటీ ఎన్‌ఎక్స్ స్టేషన్, జీటీ ఎన్‌ఎక్స్ కంట్రోలర్, జీటీ కూలింగ్ ఫ్యాన్ కమ్ ఛార్జర్, జీటీ 50 ప్రొ మాగ్‌సేఫ్ కవర్ ఉంటాయి. ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5వేల‌ తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, స్నాప్‌మింట్ కార్డ్‌లెస్ ఈఎంఐ ద్వారా తొమ్మిది నెలల వరకు చెల్లింపు సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement