త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | తెలంగాణ‌ల మ‌ళ్లా మేమే గెలుస్తం.. బీజేపీకి ఆ ఛాన్స్ లేనేలేదు

Maheshkumar Goud | సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు వ‌చ్చినోళ్ల‌తో స‌హా 90 వేల ఉద్యోగాలు పొందినోళ్లంతా మా వెంటే ఉన్నార‌ని.. వాళ్లంతా మాకే ఓటేస్తార‌ని.. మ‌ళ్లా మేమే గెలుస్తామ‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Maheshkumar Goud) వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 27, 2026, 5.55 pm IST

Maheshkumar Goud | తెలంగాణ‌ల మ‌ళ్లా మేమే గెలుస్తం.. బీజేపీకి ఆ ఛాన్స్ లేనేలేదు
Advertisement
  • కేటీఆర్‌, హ‌రీశ్‌కు రియాలిటీ తెలుస్త‌లే.. మేం గ్రౌండ్‌లో గట్టిగున్నం
  • మా ముఖ్యమంత్రి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు
  • ఇప్పుడున్నోళ్ల‌లో ఒక్క‌ బీజేపీ ఎమ్మెల్యే కూడా మ‌ళ్ల‌ గెల్వ‌డు
  • అన్ని స‌మ‌స్య‌ల‌కు న‌వంబ‌ర్ల ప‌రిష్కారం దొర్కుత‌ది
  • చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్య‌లు

Maheshkumar Goud | త్రినేత్ర న్యూస్: సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు వ‌చ్చినోళ్ల‌తో స‌హా 90 వేల ఉద్యోగాలు పొందినోళ్లంతా మా వెంటే ఉన్నార‌ని.. వాళ్లంతా మాకే ఓటేస్తార‌ని.. మ‌ళ్లా మేమే గెలుస్తామ‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Maheshkumar Goud) వ్యాఖ్యానించారు. కేటీఆర్‌, హ‌రీశ్‌కు రియాలిటీ తెల‌స్త‌లేద‌ని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి త‌మ‌కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చార‌ని.. గ్రౌండ్‌లో తామే గ‌ట్టిగున్నామ‌న్నారు. సెక్రెటేరియ‌ట్ వ‌ద్ద మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా ఆయన మంగ‌ళ‌వారం మాట్లాడారు. ఇప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్క‌రు కూడా గెల్వ‌ర‌న్నారు. న‌వంబ‌ర్ నెల‌లో అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని జోస్యం చెప్పారు.

కేటీఆర్, హరీశ్‌రావు భ్రమలో ఉన్నారు. గ్రౌండ్ రియాలిటి తెలుసుకోవడం లేదు. మా టార్గెట్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు. నవంబర్ అయ్యాక డైరెక్ట్ ఎన్నికలే మా టార్గెట్. మాకు ఉన్నంత కోఆర్డినేషన్ దేశంలో ఎక్కడా లేదు. ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో యాక్టీవ్ అయ్యారు. ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి వ్యాఖ్యలు చూసాను. కేసీఆర్ మేధావి అనుకుంటాం. కానీ ఆలోచన లేకుండా అప్పులు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు పొందిన ప్రతీ ఒక్కరు మాకు ఓటు వేస్తారు. ఉచిత కరెంట్, 90 వేల ఉద్యోగాలు పొందిన‌వాళ్లంతా మావెంటే ఉన్నారు. ప్రభుత్వాలు వచ్చినా పోయినా పార్టీ ప్రామాణికం.. పర్మినెంట్. మాకు పార్టీనే బలం. గ్రౌండ్ లో కాంగ్రెస్ బలంగా ఉంది.

ఆదిలాబాద్‌-నిజామాబాద్‌లో 40 శాతం సీట్లు మాయే..

ఎల్‌నినోపై హరీశ్‌రావు పిచ్చిగా మాట్లాడుతున్నారు. దేశమంతా ఎల్‌నినో ఉంది. బీజేపీ పని అయిపోయింది. ఇప్పుడున్న 8 ఎంపీ సీట్లలో రెండు వస్తే ఎక్కువ. 8 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా గెలువరు. ఆదిలాబాద్ - నిజామాబాదులో 40 శాతం సీట్లు మాకే వస్తాయి అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement