Amit Shah | నవంబర్ 2న తెలంగాణకు అమిత్ షా
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పర్యటనలో భాగంగా నిర్వహించనున్న పార్టీ కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతోపాటు, తగిన భద్రత కల్పించాలని కోరుతూ బీజేపీ నేతలు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.
- పర్యటన ఏర్పాట్లపై బీజేపీ దృష్టి.. డీజీపీకి నేతల వినతి
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పర్యటనలో భాగంగా నిర్వహించనున్న పార్టీ కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతోపాటు, తగిన భద్రత కల్పించాలని కోరుతూ బీజేపీ నేతలు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి పార్టీ నాయకులు డీజీపీని కలిసి తమ విజ్ఞప్తిని అందజేశారు. అమిత్ షా పర్యటన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా పోలీసు శాఖ సహకరించాలని కోరారు. పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముందస్తు అనుమతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బీజేపీ పాదయాత్ర..
బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ మహాపాదయాత్ర నిర్వహించనున్నది. ఈ యాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. ‘లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అంతం చేయండి) నినాదంతో ట్యాంక్‌బండ్ వద్ద ఈ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ పాదయాత్రను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఎస్‌ఐఆర్ విషయంలో విపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడంతోపాటు, ఓటర్ల జాబితా సవరణపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించనున్న ర్యాలీకి మరుసటి రోజే హైదరాబాద్‌లో బీజేపీ పాదయాత్ర నిర్వహిస్తుండడం గమనార్హం. దీంతో ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఇరు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మరింత వేడెక్కే అవకాశం ఉన్నది.
సంబంధిత వార్తలు

Sabarimala Online Booking | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 29 నుంచి ఆన్లైన్ బుకింగ్!
అక్టోబర్ 27, 2026

Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
అక్టోబర్ 27, 2026

TG Rains | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు..
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Maheshkumar Goud | తెలంగాణల మళ్లా మేమే గెలుస్తం.. బీజేపీకి ఆ ఛాన్స్ లేనేలేదు
- ●AssetMark Hyderabad GCC | సీబీఐటీ విద్యార్థులకు గోల్డెన్ చాన్స్.. అమెరికా కంపెనీలో జాబ్
- ●Turmeric | కేసముద్రం మార్కెట్లో పసుపునకు రికార్డు స్థాయి ధర
- ●Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?
- ●Sabarimala Online Booking | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 29 నుంచి ఆన్లైన్ బుకింగ్!
- ●Kolli Satyanarayana | ప్రజా సంఘాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి సత్యనారాయణ

Maheshkumar Goud | తెలంగాణల మళ్లా మేమే గెలుస్తం.. బీజేపీకి ఆ ఛాన్స్ లేనేలేదు

AssetMark Hyderabad GCC | సీబీఐటీ విద్యార్థులకు గోల్డెన్ చాన్స్.. అమెరికా కంపెనీలో జాబ్

Turmeric | కేసముద్రం మార్కెట్లో పసుపునకు రికార్డు స్థాయి ధర

Infinix GT 50 Pro | గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 50 ప్రొ స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?



