త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | హిట్లు లేక‌పోయినా త‌గ్గేదేలే – మ‌ళ్లీ బిజీ అవుతోన్న శ్రీలీల‌

ధ‌మాకా బ్యూటీ శ్రీలీల మ‌ళ్లీ బిజీ అవుతోంది. సినిమాల జోరును పెంచుతోంది. ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్‌తో పాటు ధ‌నుష్ ఓం సినిమాల్లో న‌టిస్తోన్న ఈ క‌న్న‌డ సుంద‌రి తాజాగా ద‌క్షిణాదిలో మ‌రో రెండు క్రేజీ ఛాన్స్‌లు ద‌క్కించుకుంది. ఆ సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On Oct 27, 2026, 6.01 pm IST

Sreeleela | హిట్లు లేక‌పోయినా త‌గ్గేదేలే – మ‌ళ్లీ బిజీ అవుతోన్న శ్రీలీల‌
Advertisement

Sreeleela |  అదృష్టమంటే శ్రీలీల‌దేన‌ని అంటున్నాయి ద‌క్షిణాది సినీ వ‌ర్గాలు. ఈ క‌న్న‌డ బ్యూటీ హిట్టు అందుకొని నాలుగైదేళ్లు దాటిపోయింది. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో ఈ అమ్మ‌డి కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. హీరోయిన్‌గా మ‌ళ్లీ అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మేన‌ని అంతా అనుకున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా మ‌ళ్లీ సినిమాల జోరు పెంచుతోంది శ్రీలీల‌.

డేర్ డెవిల్‌...

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్‌తో పాటు ధ‌నుష్ ఓం లో న‌టిస్తోన్న శ్రీలీల తాజాగా మ‌రో రెండు సినిమాల‌కుగ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అజిత్ హీరోగా ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డేర్‌డెవిల్ పేరుతో ఓ పాన్ ఇండియ‌న్‌ మూవీ రాబోతుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను అజిత్ భార్య షాలిని నిర్మిస్తోంది. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం మేక‌ర్స్‌ శ్రీలీల‌ను అనుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ధ‌మాకా బ్యూటీ ఈ త‌మిళ‌ నుంచి త‌ప్పుకున్న‌ట్లుగా కొన్నాళ్లుగా వార్త‌లొస్తున్నాయి. శ్రీలీలను ప‌క్క‌న‌పెట్టి ఆ ప్లేస్‌లో క‌య‌దు లోహ‌ర్‌ను ఎంపిక‌చేశార‌ని టాక్ న‌డుస్తోంది. ఈ రూమ‌ర్ల‌ను డైరెక్ట‌ర్ అధిక్ ఖండించారు.

దీపావ‌ళి త‌ర్వాత‌...

న‌వంబ‌ర్ 2న డేర్ డెవిల్ పూజా కార్య‌క్ర‌మాలు మొద‌లుకాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీపావ‌ళి త‌ర్వాత న‌వంబ‌ర్ రెండో వారం నుంచి ఈ త‌మిళ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో మొద‌లుకానుంద‌ని పేర్కొన్నారు. అజిత్‌తో పాటు శ్రీలీల ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగం కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రూమ‌ర్ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు.

మిరాయ్ 2

తెలుగులో ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్ మూవీలో శ్రీలీల ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. తేజా స‌జ్జా హీరోగా కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మిరాయ్ 150 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమాకు మిరాయ్ 2 పేరుతో సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్‌లో శ్రీలీల హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌లో శ్రీలీల అడుగుపెట్ట‌నుంద‌ని అంటున్నారు. మిరాయ్‌ 2లో ప్ర‌భుదేవా, రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

బాలీవుడ్‌లో...

మ‌రోవైపు హిందీలో కార్తిక్ ఆర్య‌న్‌తో తూ మేరీ జింద‌గీ హైతో పాటు జాన్వీక‌పూర్‌తో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది శ్రీలీల‌. ఐదు సినిమాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా ఉంది.

 

Advertisement
Advertisement