త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Benjamin Netanyahu | నెత‌న్యాహు చ‌నిపోయారా..? నెట్టింట జోరుగా చ‌ర్చ‌

Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి (Israel PM) బెంజిమ‌న్ నెత‌న్యాహు (Benjamin Netanyahu) చ‌నిపోయారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

D

International | Published On Mar 3, 2026, 4.43 pm IST

Benjamin Netanyahu | నెత‌న్యాహు చ‌నిపోయారా..? నెట్టింట జోరుగా చ‌ర్చ‌
Advertisement

Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి (Israel PM) బెంజిమ‌న్ నెత‌న్యాహు (Benjamin Netanyahu) చ‌నిపోయారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఖ‌మేనీ మ‌ర‌ణం అనంత‌రం నెత‌న్యాహును ఇరాన్ టార్గెట్ చేసింది. టెల్ అవీవ్‌ (Tel Aviv)లోని నెత‌న్యాహు కార్యాల‌యం, ఐడీఎఫ్‌కు చెందిన వైమానిక ద‌ళ క‌మాండ‌ర్ ప్ర‌ధాన కార్యాల‌యం (Netanyahu Office Targeted)పై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (Islamic Revolutionary Guards Corps) క్షిప‌ణి దాడులు చేసింది. తాము ప్ర‌యోగించిన ఖైబర్ క్షిపణులు (Kheibar missiles) ఆ రెండు ప్రాంతాల‌ను క‌చ్చిత‌త్వంతో తాకిన‌ట్లు ఐఆర్‌జీసీ (IRGC)ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ దాడి తర్వాత నెతన్యాహు పరిస్థితిపై అనిశ్చితి నెలకొందని ఇరాన్ ప్రకటించింది. దీంతో అప్ప‌టి నుంచి నెత‌న్యాహు చ‌నిపోయారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

ఈ మేర‌కు ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెత‌న్యాహు ఫొటోలు షేర్ చేస్తూ.. ఇజ్రాయెల్‌ ప్ర‌ధాని ఎక్క‌డ‌..? చ‌నిపోయారా..? అంటూ ట్వీట్లు చేస్తున్నారు. నెత‌న్యాహు ప‌ని అయిపోయింది.. ఇప్పుడు త‌ర్వాతి టార్గెట్ ఎవ‌రు..? అంటూ చ‌ర్చ మొద‌లు పెట్టారు. నెత‌న్యాహు ఈజ్ డెడ్ హ్యాష్‌ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇక‌ ఈ వార్త‌ల‌ను టెల్ అవీవ్ ఖండించింది. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్న వీడియోల‌ను పోస్టు చేసింది. దీంతో నెత‌న్యాహు మ‌ర‌ణ వార్త‌ల‌కు చెక్ ప‌డిన‌ట్లైంది.

Also Read..

24 గంట‌ల్లో ఇరాన్‌పై భీక‌ర దాడులు.. మ‌ధ్య ప్రాచ్యానికి మ‌రిన్ని బ‌ల‌గాలు పంపుతున్న‌ అమెరికా..!

ఇరాన్ దాడిలో ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్‌ డైరెక్ట‌ర్ మృతి - సోష‌ల్ మీడియా రూమ‌ర్ల‌లో నిజ‌మెంత?

Travel Advisory | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు.. ఢిల్లీలో 80 ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాలు ర‌ద్దు

Advertisement
Advertisement