Travel Advisory | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఢిల్లీలో 80 ఇంటర్నేషనల్ విమానాలు రద్దు..!
Travel Advisory | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
Travel Advisory | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎప్పటికప్పుడు విమానాలకు సంబంధించి అప్‌డేట్‌ను చెక్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.
వెస్ట్ ఆసియాలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పలుదేశాలకు వెళ్లాల్సిన విమానాలు ఆలస్యం జరుగుతోందని, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేయాల్సి వస్తోందని ప్రయాణీకులకు జారీ చేసిన అడ్వైజరీలో డయల్ పేర్కొంది. ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరే ముందు తప్పనిసరిగా విమానయాన సంస్థలతో టచ్‌లో ఉండాలని, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను ఫాలో కావాలని సూచించింది.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్‌స్పేస్‌ను మూసివేసిన నేపథ్యంలో మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో 80 ఇంటర్నేషనల్ విమానాలను రద్దు చేశారు. భారతీయ విమానయాన సంస్థలు గత మూడు రోజుల్లో 1,117 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశాయి. ఢిల్లీ విమానాశ్రయంలో రోజుకు 1,300కి పైగా విమానాల రాకపోకలు సాగిస్తుంటాయి. రాజకీయ సంక్షోభం కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
దుబాయి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణీకులు మాట్లాడుతూ పరిస్థితి చాలా సాధారణంగా ఉందని, పెద్దగా ఉద్రిక్తతలు లేవన్నారు. విమానాల రద్దు, ఇతర సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. దుబాయిలో ఉండేందుకు భారీగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని, తమకు ఎయిర్ ఇండియా మార్గనిర్దేశం చేసిందని, ప్రభుత్వం సహాయం అందిస్తుందని ఓ ప్రయాణికుడు వివరించారు. నోయిడాకు చెందిన మహిళ మాట్లాడుతూ.. తాము దుబాయి పర్యటన కోసం వెళ్లామని ఫిబ్రవరి 28నే తిరిగి రావాల్సి ఉండగా.. విమానాలు రద్దయ్యాయని తెలిపారు. దుబాయిలో ఖర్చులు అధికంగా ఉండడం ఇబ్బందికరంగా ఉందన్నారు. అక్కడ చిక్కుకుపోయిన పర్యాటకులను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
#WATCH | Delhi: A passenger who arrived at IGI Airport from Dubai says, "... I am from Noida. We had gone there as tourists. Our return was scheduled for February 28, and that's when all this happened, and our flight got cancelled... The Indians who are in Dubai, if the… pic.twitter.com/jruy1TdGRO
— ANI (@ANI) March 3, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






