Quentin Tarantino | ఇరాన్ దాడిలో ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ డైరెక్టర్ మృతి – సోషల్ మీడియా రూమర్లలో నిజమెంత?
ఇరాన్ ఇజ్రాయెల్ వార్‌లో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ విన్నర్ క్వింటన్ టరంటినో చనిపోయినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో టరంటినోతో పాటు ఆయన భార్యాపిల్లలు మృత్యువాడ పడినట్లు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ రూమర్లు నిజమా? కాదా? అంటే?
Entertainment | Published On Mar 3, 2026, 3.36 pm IST
Quentin Tarantino | ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ విన్నర్ క్వింటన్ టరంటినో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో టరంటినోతో పాటు అతడి భార్యాపిల్లలు మృత్యువాత పడ్డట్లు ప్రచారం జరిగింది. కొన్ని హాలీవుడ్ మీడియా సంస్థలతో పాటు నెటిజన్లు కూడా టరంటినో చనిపోయినట్లు ట్వీట్స్ చేయడంతో ఫ్యాన్స్ నిజమేనని అనుకున్నారు. దిగ్గజ హాలీవుడ్ మీడియా సంస్థ డెడ్‌లైన్ కూడా టరంటినో చనిపోయిందినిజమేనంటూ పేర్కొన్నదని వార్తలు వినిపించాయి.
రూమర్లపై క్లారిటీ...
ఈ రూమర్లపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. టరంటినో చనిపోయాడంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. టరంటినోతో పాటు ఆయన భార్యాపిల్లలు ఇజ్రాయెల్‌లో క్షేమంగా ఉన్నారంటూ తెలిపారు. టరంటినో చనిపోయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు మార్ఫింగ్ చేసినవని తేల్చేశారు. అంతే కాకుండా ఆయన షెల్టర్‌లో తలదాచుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు కూడా నిజమైనవి కావని అన్నారు.
ఇజ్రాయెల్ సింగర్...
క్వింటన్ టరంటినో భార్య డానియెల్లా పిక్ స్వస్థలం ఇజ్రాయెల్. మోడల్ కమ్ సింగర్ అయిన డానియెల్లాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు టరంటినో. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ప్రమోషన్స్ కోసం ఇజ్రాయెల్ వెళ్లిన క్వింటన్‌కు డానియెల్లాతో పరిచయం ఏర్పడిందట. 2018లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యా పిల్లల కోసం గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు క్వింటన్ టరంటినో. ఇటీవలే ఇజ్రాయెల్‌లో 115 కోట్లతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. లాస్ ఎంజెల్స్‌లోనూ ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయి.
రెండు ఆస్కార్ అవార్డులు...
హాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్న క్వింటన్ టరంటోని ఇప్పటివరకు రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇంట్లోరియస్ బాస్టర్డ్స్, పల్ప్ ఫిక్షన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ హాలీవుడ్, హేట్‌ఫుల్ 8 , కిల్‌బిల్‌తో పాటు పలు సినిమాలు క్వింటర్ టరంటినోకు దర్శకుడిగా ఎనలేని పేరు తీసుకొచ్చాయి.
.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Disha Patani | హాలీవుడ్‌లోకి ప్రభాస్ హీరోయిన్ ఎంట్రీ – ఆస్కార్ విన్నర్ సినిమాలో ఛాన్స్…
మే 10, 2026

West Asia | ఏప్రిల్ 6 వరకు ఇరాన్‌కు డెడ్‌లైన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మార్చి 27, 2026

Kashmir donations to Iran | నగదు నుంచి బంగారం వరకు.. యుద్ధంలో నష్టపోయిన ఇరాన్‌కు కశ్మీరీల భారీ విరాళాలు.. “థ్యాంక్యు ఇండియా” అన్న ఇరాన్!
మార్చి 23, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



