Melania Trump | అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
Melania Trump | వివాదాస్పద లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, యూఎస్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump) తీవ్రంగా ఖండించారు.
International | Published On Apr 10, 2026, 10.54 am IST
Melania Trump | వివాదాస్పద లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, యూఎస్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump) తీవ్రంగా ఖండించారు. తాను అతనితో ఎప్పుడూ స్నేహం చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు చేస్తున్న నీచమైన ప్రయత్నాలని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు గురువారం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ.. ఓ సంచలన ప్రకటన చేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ముడిపెడుతూ చేస్తున్న అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి అని మెలానియా పేర్కొన్నారు.
తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నవారికి నైతిక విలువలు, గౌరవం లేవని ఆమె విమర్శించారు. అలాంటి ఆరోపణలను తాను పట్టించుకోనని.. అయితే, తన గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఎప్‌స్టీన్ బాధితురాలు అంటూ వస్తున్న ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. “నేను ఎప్‌స్టీన్ బాధితురాలిని కాదు. తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతని నేరాల గురించి కూడా నాకు తెలియదు. అతని ప్రైవేట్‌జెట్‌లోనూ ప్రయాణించలేదు. అతని ఐలాండ్‌కు కూడా ఎప్పుడూ వెళ్లలేదు. ట్రంప్‌ను నాకు ఎప్‌స్టీన్ పరిచయం చేశారన్న వార్తల్లో కూడా నిజం లేదు. 1998లో న్యూయార్క్‌లో జరిగిన ఒక పార్టీలో నేను ట్రంప్‌ను మొదటిసారి కలిశాను. అంతేకాదు ఎప్‌స్టీన్ స్నేహితురాలు ఘిస్లేన్ మాక్స్‌వెల్‌తో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు” అని మెలానియా ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలని మెలానియా ఆకాంక్షించారు. బాధితులైన ప్రతి మహిళకు బహిరంగంగా తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం ఇవ్వాలని, వారి వాంగ్మూలాలను కాంగ్రెషనల్ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
First Lady Melania Trump’s Statement pic.twitter.com/juyoDgi2QR
— First Lady Melania Trump (@FLOTUS) April 10, 2026
Also Read..
భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. తగ్గిన చమురు ధరలు, బలపడ్డ డాలర్..
డెకాయిట్ రివ్యూ - అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
సంబంధిత వార్తలు

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
ఆగస్టు 22, 2026

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
ఆగస్టు 18, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..
- ●Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. హరీశ్ రావు, కూనంనేని సంతాపం
- ●Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం

Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..

Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. హరీశ్ రావు, కూనంనేని సంతాపం

Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ



