Dacoit Review | డెకాయిట్ రివ్యూ – అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన డెకాయిట్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?
Entertainment | Published On Apr 10, 2026, 9.50 am IST
Dacoit Review | కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోగా వరుస విజయాలను అందుకుంటున్నాడు అడివిశేష్. మరోసారి కొత్తదనాన్ని నమ్మి అడివిశేష్ చేసిన లెటేస్ట్ మూవీ డెకాయిట్. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన డెకాయిట్ ఎలా ఉంది? ఈ సినిమాతో అడివిశేష్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా లేదా అంటే....
హరి, సరస్వతి ప్రేమకథ...
హరి దాస్ (అడివి శేష్) ఓ మర్డర్ కేసులో పదమూడేళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తుంటాడు. హరి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న సరస్వతి (మృణాల్ ఠాకూర్) అతడికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది. ప్రియురాలిపై పగతో రగలిపోయిన హరి జైలు నుంచి తప్పించుకుంటాడు. హరికి దూరమైన సరస్వతి భాస్కర్‌ను పెళ్లిచేసుకుంటుంది. ఆమె భర్త హాస్పిటల్ పాలవుతాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు చాలా డబ్బు అవసరమవుతుంది. సరస్వతి భర్తకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న హాస్పిటల్‌లోనే దొంగతనం చేయాలని హరి ప్లాన్ చేస్తాడు. డబ్బు కోసం ఈ రాబరీలో సరస్వతి కూడా భాగమవుతుంది. వారి ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? హరిని ప్రేమించిన సరస్వతి అతడిని ఎందుకు జైలుకు పంపించింది? సరస్వతి గురించి హరికి తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? ఆమె ప్రేమ కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు అన్నదే ఈ మూవీ కథ.
రొటీన్‌కు భిన్నంగా...
అడివి శేష్ సినిమాలన్నీ రొటీన్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌లతో సాగుతుంటాయి. మరోసారి డెకాయిట్‌తో అదే ప్రయత్నం చేశారు. కథ పరంగా చూసుకుంటే డెకాయిట్ సాదాసీదా లవ్‌స్టోరీనే. కానీ రెగ్యులర్ ప్రేమకథల్లో కనిపించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ ఇందులో ఇండవు. స్క్రీన్‌ప్లే, టేకింగ్‌తో పాటు క్లైమాక్స్ ...ప్రతి విషయంలో కొత్తగా ఆలోచించారు. ఆడియెన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని అనుకున్నారు. విషాదాంత ప్రేమకథలు అచ్చిరావనే సెంటిమెంట్ టాలీవుడ్‌లో ఉంది. ఆ సెంటిమెంట్‌ను ఈ సినిమాతో తిరగరాయాలని అనుకున్నారు.
నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే
ప్రేమకథకు యాక్షన్, రివేంజ్ అంశాలను జోడించి డెకాయిట్ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ షానీల్ డియో. అంతర్లీనంగా కులాల వివక్షతో పాటు కరోనా టైమ్‌లో జనాలను హాస్పిటల్స్ ఎలా దోచుకున్నాయన్నది చూపించారు. చేయని తప్పుకు హరి జైలు శిక్షను అనుభవించే సీన్స్‌తో ఈ సినిమాను మొదలుపెట్టిన తీరు ఆసక్తిని పంచుతుంది. హరి, సరస్వతిల ప్రేమకథను నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్‌తో చెప్పడం ఆకట్టుకుంటుంది.
ఎప్పుడైతే హరి జైలు నుంచి తప్పించుకుంటాడో అక్కడి నుంచి సినిమా ఉత్కంఠను పంచుతుంది.
సరస్వతితో కలిసి హరి హాస్పిటల్‌లో డబ్బు కొట్టేయాలని అనుకోవడం...మరోవైపు ఆపరేషన్‌కు అవసరమైన డబ్బుల కోసం సరస్వతి పడే మనోవేదన, రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ కోసం హరి ఎదురుచూడటం... వీటన్నింటిని ముడిపెడుతూ థ్రిల్లింగ్‌గా కథను ముందుకు నడిపించారు.
సెకండాఫ్ కంప్లీట్ ఎమోషనల్‌గా సాగుతుంది. హీరోయిన్ పాత్రకు సంబంధించిన ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్లారు డైరెక్టర్. చివరలో ప్రియురాలి కోసం హీరో ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడన్నది ఉద్వేగభరితంగా ప్రజెంట్ చేశారు.
కన్వీన్సింగ్ క్లైమాక్స్
డెకాయిట్ కాన్సెప్ట్ బాగుంది. కానీ స్క్రీన్‌ప్లేలోనే బలం లేదు. హాస్పిటల్స్ నుంచి హరి, సరస్వతి డబ్బులు దొంగతనం చేసే సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. పోలీసుల ఇన్వేస్టిగేషన్ ఎపిసోడ్స్ సినిమా నిడివిని పెంచడానికే ఉపయోగపడ్డాయి. సరస్వతి ప్రేమ కోసం హరి చేసే త్యాగం కూడా అంత కన్వీన్సింగ్‌గా అనిపించదు.
అడివిశేష్ ఆల్‌రౌండర్...
హరి పాత్రలో అడివి శేష్ అల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. మాస్ రోల్‌లో అతడి నటన బాగుంది. యాక్షన్ సీన్లలో మెప్పించాడు. ఈ సినిమా కోసం మదనపల్లి యాస ట్రై చేయడం కొత్తగా ఉంది. మృణాల్ ఠాకూర్ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో తన నటనతో మెప్పించింది. పోలీస్ ఆఫీసర్స్‌గా అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్ యక్టింగ ఒకే. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణితో పాటు చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నా వారిని సరిగ్గా వాడుకోలేదు.
ప్రేమను కొత్త కోణంలో...
టెక్నికల్‌గా మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సౌండ్ డిజైనింగ్, విజువల్స్ అదిరిపోయాయి. భీమ్స్ పాటలు ఆకట్టుకోలేదు. కానీ గ్యానీ బీజీఎమ్ మాత్రం బాగుంది. సుప్రియ యార్లగడ్డ ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.
డెకాయిట్ ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా క్లైమాక్స్‌ను ఆడియెన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారన్నదానిపైనే సినిమా విజయావకాశాలు ఆధారపడ్డాయి ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ – అధ్యక్ష పదవికి పోటీ
ఆగస్టు 25, 2026

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు – జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం – కానీ ఓ కండీషన్
ఆగస్టు 25, 2026

Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



