Summer | మధ్యాహ్నం ఆ మూడు గంటలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దు.. ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక
Summer | రాష్ట్రంలో ఎండలు (Summer) మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే వేడి, ఉక్కపోత ప్రారంభమవుతున్నాయి. మధ్యాహ్నానికి బయట తిరగలేని విధంగా సూర్యుడు ప్రతాపం (Heat Wave) చూపిస్తున్నాడు.
Summer | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు (Summer) మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే వేడి, ఉక్కపోత ప్రారంభమవుతున్నాయి. మధ్యాహ్నానికి బయట తిరగలేని విధంగా సూర్యుడు ప్రతాపం (Heat Wave) చూపిస్తున్నాడు. పలు జిల్లాలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఎండల తీవ్రత మరింత (Temperatures) పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 14 వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య సూర్యకాంతిలో బయటకు రావద్దని సూచించింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపింది. బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని గదుల్లో ఉండాలని పేర్కొంది. మధ్యాహ్నం భారీ శ్రమతో కూడిన పనులు చేయొద్దని, కాలి నడకన చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదని తెలిపింది. అధిక వేడి సమయంలో వంట చేయకూడదని సూచించింది. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బనేటెడ్ డ్రింక్స్, ఎక్కువ చెక్కర ఉన్న పానీయాలు అస్సలు తీసుకోవద్దని, అధిక ప్రోటీన్, ఉప్పు, మసాలా, నూనె ఎక్కువ ఉండే ఆహారం తినకూడదని హెచ్చరించింది. నీరు బాగా తాగాలని, దాహం లేకపోయినా తరచుగా సరిపడ నీరు తాగాలని సూచించింది.
సంబంధిత వార్తలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
ఆగస్టు 25, 2026

Graduates’ MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
ఆగస్టు 25, 2026

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



