త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ ప‌ర్య‌ట‌న‌.. 30న రాష్ట్రానికి..

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మ‌రోసారి విదేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. గురువారం నుంచి ప‌ది రోజుపాటు సీఎం టూర్ (CM Revant Foreign Tour) కొన‌సాగ‌నుంది. ఆగస్టు 20 నుంచి 30 వరకు అమెరికా (America), బ్రిటన్ (Britain) దేశాలలో పర్యటించనున్నారు.

G

Telangana | Published On Aug 20, 2026, 6.30 am IST

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ ప‌ర్య‌ట‌న‌.. 30న రాష్ట్రానికి..
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మ‌రోసారి విదేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. గురువారం నుంచి ప‌ది రోజుపాటు సీఎం టూర్ (CM Revant Foreign Tour) కొన‌సాగ‌నుంది. ఆగస్టు 20 నుంచి 30 వరకు అమెరికా (America), బ్రిటన్ (Britain) దేశాలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి గురువారం రాత్రి ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరుతారు. రెండు దేశాల్లో ఉన్న పలు వర్సిటీలను సందర్శిస్తారు. వర్సిటీ బృందాలతో సమావేశం కానున్నారు. లండన్ పర్యటన అనంతరం అమెరికాకు వెళ్ల‌నున్నారు.

సీఎం షెడ్యూల్ ఇదే

  • ఆగ‌స్టు 20న- రాత్రి 12.30 గంట‌ల‌కు లండ‌న్ బ‌య‌ల్దేరుతారు..
  • ఆగస్టు 21న- లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలోని (Oxford University) బ్లావట్నిక్‌ స్కూల్‌ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శిస్తారు. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారు.
  • ఆగస్టు 22న- లండన్‌లో కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం సమావేశం కానున్నారు. అదేరోజు ఉదయం 11.30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌కి వెళ్తారు.
  • ఆగస్టు 23న- లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు ప‌య‌న‌మ‌వుతారు.
  • ఆగస్టు 24న బోస్టన్‌లో ఉదయం 10.30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఎంఐటీ క్యాంపస్‌కు వెళ్తారు.
  • ఆగస్టు 25న- ఉదయం 10.30 గంటలకు బోస్టన్‌లో నార్త్‌ ఈస్టర్న్ క్యాంపస్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం అవుతారు. అనంత‌రం రాత్రి 7 గంటలకు న్యూయార్క్ (New York) సిటీకి బ‌య‌ల్దేరుతారు.
  • ఆగస్టు 26న- న్యూయార్క్‌లో రాత్రి 7 గంటలకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • ఆగస్టు 29న- న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
  • ఆగస్టు 30న- సీఎం రేవంత్‌ హైదరాబాద్‌కు చేరుకుంటారు.
Advertisement
Advertisement