John Ternus | యాపిల్ తదుపరి సీఈవోగా జాన్ టెర్నస్..? టిమ్ కుక్ పదవీ విరమణపై స్పష్టత..
John Ternus | యాపిల్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ టెర్నస్ భవిష్యత్తులో టాప్ మేనేజ్మెంట్ బాధ్యతలు చేపట్టే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రస్తుత సీఈవో టిమ్ కుక్కు వారసుడిగా టెర్నస్ను పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
John Ternus | యాపిల్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ టెర్నస్ భవిష్యత్తులో టాప్ మేనేజ్మెంట్ బాధ్యతలు చేపట్టే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రస్తుత సీఈవో టిమ్ కుక్కు వారసుడిగా టెర్నస్ను పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ABC ఛానెల్లో ప్రసారమైన గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న టిమ్ కుక్ తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను ఖండించారు. యాపిల్ లేకుండా జీవితం ఊహించలేను.. అంటూ ఆయన స్పష్టం చేశారు. రిటైర్మెంట్పై వచ్చిన వార్తలపై స్పందిస్తూ, లేదు, నేను అలా చెప్పలేదు. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. నేను చేసే పనిని ఎంతో ప్రేమిస్తున్నాను. 28 సంవత్సరాల క్రితం యాపిల్లో చేరాను, అప్పటి నుంచి ప్రతి రోజూ నాకు ఎంతో ఇష్టం.. అని కుక్ పేర్కొన్నారు.
బ్లూమ్బర్గ్ బిజినెస్వీక్లో కథనం..
ఈ వ్యాఖ్యలు యాపిల్ సీనియర్ మేనేజ్మెంట్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో వచ్చాయి. డిసెంబర్ నెలలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి జాన్ జియానాండ్రియా, చీఫ్ లీగల్ ఆఫీసర్, అలాగే ప్రముఖ డిజైన్ నాయకుడు వారం వ్యవధిలోనే సంస్థను వీడినట్లు సమాచారం. అదనంగా హార్డ్వేర్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ కూడా వైదొలగే సంకేతాలు ఇచ్చినట్లు సీఎన్బీసీ నివేదిక తెలిపింది. బ్లూమ్బర్గ్ బిజినెస్వీక్లో మార్క్ గుర్మన్ రాసిన తాజా కథనంలో టెర్నస్ కెరీర్, ప్రభావాన్ని విశ్లేషించారు. టిమ్ కుక్ తన వారసుడు సంస్థ లోపల నుంచే రావాలని కోరుకుంటున్నారని, తద్వారా ఆయనకు మార్గదర్శకత్వం ఇవ్వగలుగుతానని భావిస్తున్నారని గుర్మన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థిగా జాన్ టెర్నస్ పేరును ప్రస్తావించారు.
కీలక విభాగాలను పర్యవేక్షిస్తున్న జాన్ టెర్నస్..
యాపిల్ ఆదాయంలో దాదాపు 80 శాతం వరకు డివైసెస్ అభివృద్ధి విభాగం నుంచే వస్తుండగా, ఆ సెక్షన్ను జాన్ టెర్నస్ పర్యవేక్షిస్తూ కీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన వయసు 50 సంవత్సరాలు కావడం వల్ల ఇతర సీనియర్ నాయకులతో పోలిస్తే ఎక్కువ కాలం నాయకత్వం వహించే అవకాశం ఉంది.. అని గుర్మన్ పేర్కొన్నారు. 2021లో హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి అధిపతిగా నియమితులైన టెర్నస్, ఆ తర్వాత యాపిల్ ఉత్పత్తులను మరింత విస్తృతంగా, మెరుగైన నాణ్యతతో తీసుకువచ్చే దిశగా కృషి చేశారు. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్, వేగం, కనెక్టివిటీ అంశాలపై దృష్టి సారించారు. ఇటీవల న్యూయార్క్లో జరిగిన 599 డాలర్ల విలువైన మాక్బుక్ నియో విడుదల కార్యక్రమంలో టిమ్ కుక్ స్థానంలో టెర్నస్ స్వయంగా ప్రదర్శన ఇచ్చారు. తరువాతి రోజు గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో కూడా పాల్గొని ఉత్పత్తిని ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతానికి టెర్నస్ను ఇప్పటికిప్పుడు సీఈవోగా నియమించకపోయినా టిమ్ కుక్ వారసుడు ఆయనే అని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
- ●BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?
- ●Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..
- ●The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

BSNL | సరికొత్త శాటిలైట్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్.. రూ.1.34లక్షల ఫోన్ ఎవరి కోసం.. ప్రత్యేకతలు ఏంటంటే..?

Minister Ponnam | సమస్యల పరిష్కారం కోసం కొండా సురేఖను కలిసిన మంత్రి పొన్నం..

The Furious Review | ది ఫ్యూరియస్ రివ్యూ - లోకేష్ కనగరాజ్ ఖైదీతో కంపేరిజన్స్ - యాక్షన్ లవర్స్ మిస్సవ్వొద్దు

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా






