త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parking Spaces | 196 పార్కింగ్ స్థలాలు కొని.. రెట్టింపు అద్దెతో కోట్లు ఆర్జిస్తున్న మహిళ

Parking Spaces | చైనా (China) హునాన్ ప్రావిన్స్ (Hunan province)కు చెందిన వు అనే మ‌హిళ 2018లో రూ.20 కోట్లు వెచ్చించి 196 పార్కింగ్ స్థ‌లాల‌ను కొనుగోలు చేసింది. ప్ర‌స్తుతం ఆ పార్కింగ్ స్థ‌లాల‌కు భారీగా డిమాండ్ పెర‌గ‌డంతో వాటిని రెట్టింపు ధ‌ర‌కు అద్దెకు ఇవ్వ‌డం ప్రారంభించింది. అంతేకాదు, తాను కొన్న అస‌లు ధ‌ర‌కంటే 80 శాతం ఎక్కువ‌కు సేల్‌కు కూడా పెట్టింది.

D

International | Published On Oct 10, 2026, 4.22 pm IST

Parking Spaces | 196 పార్కింగ్ స్థలాలు కొని.. రెట్టింపు అద్దెతో కోట్లు ఆర్జిస్తున్న మహిళ
Advertisement

Parking Spaces | త్రినేత్ర న్యూస్ : చైనా (China)లో ఓ మ‌హిళ ముందు చూపు ఆమెకు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. హునాన్ ప్రావిన్స్ (Hunan province)కు చెందిన వు అనే మ‌హిళ చాంగ్షా నగరంలోని ఒక రెసిడెన్షియల్ కమ్యూనిటీలో 2018లో రూ.20 కోట్లు వెచ్చించి 196 పార్కింగ్ స్థ‌లాల‌ను (Parking Spaces) కొనుగోలు చేసింది. ఆ స‌మ‌యంలో అక్కడ సరైన రవాణా సౌకర్యాలు, దుకాణాలు, పాఠశాలలు లేకపోవడంతో జనం ఇళ్లు, పార్కింగ్ స్థలాల‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.

అయితే, స్థానిక అభివృద్ధి ప్రణాళికను ముందే అంచనా వేసిన వు.. బిల్డర్ (Developer) నుంచి ఆ కాంప్లెక్స్‌లోని మొత్తం పార్కింగ్‌లో 40 శాతం వాటాను అంటే 196 పార్కింగ్ స్థ‌లాల‌ను సింగిల్ పేమెంట్‌లో కొనేశారు (Chinese Woman Buys 196 Parking Spaces). దీంతో అంతా ఆమెను విచిత్రంగా చూశారు. కానీ కొన్నేళ్ల‌కే ఆమె ఊహించిన‌ట్టే ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ఇళ్లు, పాఠ‌శాల‌లు, దుకాణాలు వెలిశాయి. అదే స‌మ‌యంలో పార్కింగ్ స్థ‌లాల‌కు డిమాండ్ కూడా విప‌రీతంగా పెరిగింది. దీంతో ఆమె త‌న‌ స్థలాలకు లాక్స్ ఏర్పాటు చేసి ప్రాప‌ర్టీని కాపాడుకుంటూ వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ తాను కొనుగోలు చేసిన స‌మ‌యంలో ఉన్న ధ‌ర కంటే ఇప్పుడు రెట్టింపు ధ‌ర‌కు స్థ‌లాల‌ను అద్దెకు ఇవ్వ‌డం మొద‌లు పెట్టింది. అద్దె నెల‌కు రూ.7,200గా నిర్ణ‌యించింది.

అంతేకాదు, త‌న ప్రాప‌ర్టీని సేల్‌కు కూడా పెట్టింది. ఒక్కో పార్కింగ్ స్థ‌లానికి రూ.14.52 ల‌క్ష‌లుగా ధ‌ర నిర్ణ‌యించింది. ఇది ఆమె కొన్న అస‌లు ధ‌ర‌కంటే 80 శాతం ఎక్కువ కావ‌డం విశేషం. దీంతో వూపై స్థానికుల్లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. రెంటు ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని చాలా మంది రెసిడెన్స్ ఆమెను కోరారు. అందుకు ఆమె నిరాక‌రించింది. దీంతో వారంతా కోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా వూకే అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. డెవ‌ల‌ప‌ర్ అమ్మ‌కానికి పెట్టిన‌ప్పుడు ఎవ‌రూ కొనేందుకు ముందుకు రాలేద‌ని కోర్టు పేర్కొంది. వూ మాత్ర‌మే రిస్క్ తీసుకుని అక్క‌డ పెట్టుబ‌డి పెట్టార‌ని గుర్తు చేసింది.

Also Read..

నిర‌స‌న‌ల వేళ‌.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిష‌న్‌

నీకున్న రోగానికి అల్లోప‌తి వ‌డ్త‌లేద‌ట.. ఇగో కాయ‌క‌చూరి వ‌టు

Advertisement
Advertisement