త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ED Petition in HC | జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిష‌న్‌

ED Petition in HC | ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత‌ జగన్‌ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ప్ర‌తిరోజు విచారించి కేసును వేగంగా తేల్చాలని త‌న‌ పిటిషన్‌లో కోరింది.

S

National | Published On Oct 10, 2026, 3.29 pm IST

ED Petition in HC | జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిష‌న్‌
Advertisement

ED Petition in HC | త్రినేత్ర న్యూస్: ‎ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత‌ జగన్‌ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో శ‌నివారం ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ప్ర‌తిరోజు విచారించి కేసును వేగంగా తేల్చాలని త‌న‌ పిటిషన్‌లో కోరింది. జగన్‌తో పాటు నిందితులందరినీ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని విజ్ఞ‌ప్తి చేసింది. సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని.. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లలో పురోగ‌తి లేకపోవడంతో విచారణ ముందుకు సాగ‌డం లేదని ఈడీ హైకోర్టుకు వివ‌రించింది.

ఆర్థిక నేరాలను దేశ ఆర్థిక ఆరోగ్యానికే తీవ్ర‌ ముప్పుగా పరిగణించాలని విన్న‌వించింది. కాగా ఈడీ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేప‌ట్టిన‌ తెలంగాణ హైకోర్టు జగన్ కేసులు త్వరగా తేల్చాలని గతంలోనూ పిటిషన్ దాఖలైనట్లు ఈ సంద‌ర్భంగా గుర్తించింది. హరిరామజోగయ్య, ఇతరుల పిటిషన్లతో కలిపి ఈడీ పిటిషన్ జత చేయాలని ఆదేశించింది. అన్ని పిటిషన్లను కలిపి ఈ నెల 13న విచారణ చేపట్టనున్నట్లు వెల్ల‌డించింది.

Advertisement
Advertisement