త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | నిర‌స‌న‌ల వేళ‌.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

Abhijeet Dipke | అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. దిప్కే నాన‌మ్మ సావిత్రిబాయి శంక‌ర్‌రావ్ దిప్కే (85) హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలోని త‌న నివాసంలో ఇవాళ ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో క‌న్నుమూశారు.

D

National | Published On Oct 10, 2026, 3.31 pm IST

Abhijeet Dipke | నిర‌స‌న‌ల వేళ‌.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం
Advertisement

Abhijeet Dipke | ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన భారీ నిర‌స‌న‌ల వేళ ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. దిప్కే నాన‌మ్మ సావిత్రిబాయి శంక‌ర్‌రావ్ దిప్కే (85) హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలోని త‌న నివాసంలో ఇవాళ ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో క‌న్నుమూశారు.

ఇవాళ ఉద‌యం నిర‌స‌న‌ల కోసం దిప్కే ముంబై నుంచి ఢిల్లీకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఫ్లైట్ దిగ‌కముందే ఆయ‌న్ని పోలీసులు (Delhi Police) అదుపులోకి తీసుకున్నారు (detention). ఆ స‌మ‌యంలోనే నాన‌మ్మ మ‌ర‌ణ‌వార్త‌ను పోలీసులు దిప్కేకు తెలియ‌జేశారు. నిర్బంధంలో ఉంటూనే నిర‌స‌న‌ను కొన‌సాగిస్తారా..? లేక అంత్య‌క్రియ‌ల కోసం స్వ‌గ్రామానికి వెళ్తారా..? అనేది ఆయ‌న ఇష్ట‌మ‌ని పోలీసులు తెలిపారు.

కాగా, సావిత్రిబాయి గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హింగోలిలోని ఆసుప‌త్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆరోగ్యం మ‌రింత క్షీణించి ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. దిప్కే చివ‌రిసారిగా త‌న నాయిన‌మ్మ‌ను ఆగ‌స్టు 15న క‌లిశార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆ త‌ర్వాత మ‌రోసారి క‌లిసి ఆరోగ్యం గురించి ఆరా తీసిన‌ట్లు చెప్పారు. గ‌త 25 రోజులుగా దిప్కే తన నాన‌మ్మ‌ను చూడ‌లేద‌ని పేర్కొన్నారు. ఆమె అంత్య‌క్రియ‌లు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read..

ఢిల్లీలో ఉద్రిక్త‌త‌.. పోలీసుల‌పై రాళ్లు రువ్విన నిర‌స‌న‌కారులు

క‌ర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిష‌న్‌

Advertisement
Advertisement