త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chirumilla Rakesh | నీకున్న రోగానికి అల్లోప‌తి వ‌డ్త‌లేద‌ట.. ఇగో కాయ కచోరి వ‌టు

Chirumilla Rakesh | కేటీఆర్, హ‌రీశ్‌రావుల‌పై మాట్లాడ‌డానికి బ‌ల్మూరి వెంక‌ట్ ఎవ‌ర‌ని బీఆర్ఎస్ నేత చిరుమిల్ల రాకేశ్ మండిప‌డ్డారు. నీ భార్య‌కు ప‌ట్టుబ‌డిన నువ్వా మాట్లాడేదని ఫైర‌య్యారు.

S

Telangana | Published On Oct 10, 2026, 4.15 pm IST

Chirumilla Rakesh | నీకున్న రోగానికి అల్లోప‌తి వ‌డ్త‌లేద‌ట.. ఇగో కాయ కచోరి వ‌టు
Advertisement
  • నీ భార్య‌కు ప‌ట్టువ‌డిన నువ్వు మాట్లాడుతున్న‌వా?
  • యాడ్ ఏజెన్సీ మ‌హిళ‌ను గెలికింది, మ్యాగీ మిల్లాను గోకిందెవ‌లు?
  • ‎కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్‌పై ఊగిపోయిన చిరుమిల్ల రాకేశ్

Chirumilla Rakesh | త్రినేత్ర న్యూస్: బ‌ల్మూరి వెంక‌ట్‌కున్న రోగానికి అల్లోప‌తి ప‌డ్త‌లేద‌ని.. అందుకే కాయ కచోరి మందు పంపిస్తున్నామ‌ని బీఆర్ఎస్ నేత చిరుమిల్ల రాకేశ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్, హ‌రీశ్‌రావుల‌పై మాట్లాడ‌డానికి బ‌ల్మూరి ఎవ‌ర‌ని మండిప‌డ్డారు. భార్య‌కు ప‌ట్టుబ‌డిన నువ్వా మాట్లాడేదని ఫైర‌య్యారు. యాడ్ ఏజెన్సీ మహిళను గెలికింది, మ్యాగీ మిల్లాను గోకింది, గోవా బీచ్ విల్లా ఎవరికి ఇచ్చారో అన్నీ బయటపడతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బ‌ల్మూరిపై తీవ్ర స్థాయిలో ఊగిపోయారు.

ఆయ‌న‌కున్న రోగానికి అల్లోప‌తి ప‌డ్త‌లేద‌ట‌. అందుకే కాయ‌క‌చూరి అనే మందు తెచ్చినం.. ఆయ‌న‌కు పంపిస్తున్నం. ఇప్ప‌టిదాక మేం మాట్లాడలే. నిన్న కేటీఆర్ మీద మాట్లాడిన ముచ్చ‌ట‌ కావొచ్చు, మొన్న హ‌రీశ్ రావు మీద మాట్లాడింది కావొచ్చు. నిన్న సంబంధం లేని కొండ‌ల్‌రావును, న‌వీన్‌రావును తీసుకొచ్చి మాట్లాడిండు. ఈ కాయ‌క‌చూరి లీడ‌ర్ మొద‌టి భార్య పంచాయితీ తెంపిందే కొండల్‌రావు. ఆ కోపంతోనే కొండ‌ల్‌రావు మీద మాట్లాడిండు. యాడ్ ఏజెన్సీ మహిళను గెలికింది, మ్యాగీ మిల్లాను గోకింది, గోవా బీచ్ విల్లా ఎవరికి ఇచ్చారో అన్నీ బయటపడతాయి. వీళ్లు ఈ మధ్య డీలర్లు అయ్యారు.

ఎవ‌డ్రా నువ్‌?

ఒక డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకున్నంక పార్టీలో తిరిగే కార్య‌క‌ర్త‌తో నువ్ దొర్కితేనే క‌దా నీకు డైవ‌ర్స్ ఇచ్చింది. నువ్ మాట్లాడుతున్న‌వా ఇయ్యాళ్ల‌? ఏం మాట్లాడుతుర్రు మీరు భాష‌. వ్య‌క్తిగ‌తంగానా! మీకున్న దొంగ ఆస్తులు బ‌య‌టేస్తే ఏదివ‌డితే అది మాట్లాడ్త‌రా? ఎవ‌డ్రా నువ్ మాట్లాడ‌నీకి. ఏం మాట్లాడుతున్న‌వ్?

హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి, బల్మూరి వెంకట్ బీజేపీని గెలిపించిర్రు. 9వ తేదీన మేం దుబాయ్ పోవాలి. బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి ఎట్లొచ్చింది? ఎవరెవరికి బల్మూరి వెంకట్ సూట్ కేసులు మోసిండో తెల్సు. రేవంత్ రెడ్డి 50 లక్షలతో ప్రభుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ప్రయత్నం చేస్తూ పట్టువ‌డ్డ‌డు. రెండోసారి పర్మిషన్ లేకుండా ఇంటిపై డ్రోన్ ఎగ‌రేసి దొరికిండు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెర్ఫార్మన్స్ 11 శాతం ఉంది. ఎంపీ ల్యాడ్స్ ఖర్చువెట్టుడు గడ్డం వంశీకి చేతనైత‌లే. గడ్డం వెంకటస్వామిని గౌరవించింది కేసీఆర్. ట్యాంక్ బండ్‌పై కాకా విగ్రహాన్ని కేసీఆర్ పెట్టిండు. గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్ర‌ర్ రానియ్య‌రు. మూడేండ్ల‌లో మెడికల్ బోర్డు పెట్టడం గడ్డం వంశీ కృష్ణతోని అయిత‌లే.

వంశీ కంకులు తీస్తం..

బల్మూరి వెంకట్‌కు కాయ కచోరీ మందును ఎల్పీ ఆఫీస్‌కు, విప్ ఆఫీస్‌కు, ఇంటికి పంపిస్తం. డ్రగ్స్ గురించి మాట్లాడుతుండు. రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లిస్తానని ఎగ్గొంటిండు. ఓయూలో గంజాయి మొక్కలు సాగైతున్నందుకు రేవంత్ విద్యా మంత్రిగా సిగ్గు పడాలి. నైనీ కోల్ బ్లాక్ గురించి గడ్డం వంశీకృష్ణ భట్టి అంకుల్‌ను ఎందుకు అడుగుత‌లే? కేటీఆర్‌ను అంకుల్ అంటున్న వంశీ కంకులు తీస్తం.

రాహుల్ బ‌గ్గ తాగి ఎక్కిండా మ‌రి?

ఇదేనా మీ క‌ల్చ‌ర్‌? కాంగ్రెస్ పార్టీ నేర్పిన సంస్కృతి ఇదేనా? ఇదే అయితే మేం గూడ మాట్లాడుతం. మీ రాహుల్ గాంధీని ర‌మ్మ‌ను. మొన్న డ్ర‌గ్స్ తీస్కొని బారికేడ్లు ఎక్కిండు. ఆని వ‌య‌సెంత వాడు బారికేడ్ల మీదికెక్కుడేంది? 58 ఏండ్లు ఉంట‌య్‌.. బారికేడ్ల మీదికెందుకెక్కుండు? బ‌గ్గ తాగెక్కిండా మ‌రి ఇగ‌. వాడు గూడ డ్ర‌గ్స్ తీసుకుంటుండు. ఫస్ట్ వాన్ని చెక్ చేయిర్రి అని ఫైర‌య్యారు.

వెంట్రుక కృష్ణ‌గా మారిండు: గౌతమ్ ప్రసాద్, బీఆర్ఎస్ నేత

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ గురించి మాట్లాడటానికి ఎంపీ అయిండా? ఎంపీగా పెద్దపల్లి ప్రజలు గెలిపించింది అందుకేనా? పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 4,200 కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులు ఎక్క‌డియ‌క్క‌న్నే ఉన్న‌య్‌. నీ అయ్య రాష్ట్రానికి కార్మిక శాఖా మంత్రిగా ఉండి ఏం పీకుతున్న‌డు? పూటకో పార్టీ మారుడు గడ్డం వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి అలవాటే. తనుగుల చెక్ డ్యామ్ పేల్చేస్తే గడ్డం వంశీకృష్ణ ఏం చేసిండు? గడ్డం వంశీకృష్ణ వెంట్రుక కృష్ణగా మారిండు.

Advertisement
Advertisement