త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Roller | పాల‌పిట్ట‌ను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే క‌ఠిన చ‌ర్య‌లు..

Indian Roller | పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లినప్పుడు త‌మ ఆయుధాలను ఎవరికీ కనిపించకుండా జమ్మి చెట్టుపై (Jammi Chettu) దాస్తారు. దసరా పండుగ (Dasara Festival) రోజున అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత జమ్మి చెట్టుకు పూజించి ఆయుధాలను తీస్తుండగా పాలపిట్టలను (Indian Roller) చూస్తారు.

G

Telangana | Published On Sep 29, 2026, 9.29 am IST

Indian Roller | పాల‌పిట్ట‌ను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే క‌ఠిన చ‌ర్య‌లు..
Advertisement

Indian Roller | త్రినేత్ర న్యూస్‌: పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లినప్పుడు త‌మ ఆయుధాలను ఎవరికీ కనిపించకుండా జమ్మి చెట్టుపై (Jammi Chettu) దాస్తారు. దసరా పండుగ (Dasara) రోజున అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత జమ్మి చెట్టుకు పూజించి ఆయుధాలను తీస్తుండగా పాలపిట్టలను (Indian Roller) చూస్తారు. అప్పటి నుంచి జమ్మి చెట్టును పూజించి, పాలపిట్టను చూస్తే ఆ ఏడాది అంతా శుభమే జరుగుతుందని చాలా మందికి విశ్వాసం. అది అనాధిగా జరుగుతూ వస్తుంది. అయితే పాలపిట్టను ఆ రోజు చూడటం కోసం కొందరు వాటిని పంజరాల్లో బంధిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మి రోజున దీనిని చూస్తే మంచి జరుగుతుందని, విజయాలు వస్తాయని చాలా మందిలో ఉన్న నమ్మకాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పాలపిట్టల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. పంజ‌రాల్లో (Cages) బంధించి ప్ర‌ద‌ర్శిస్తే కఠిన చర్యలు (Imprisonment) తీసుకుంటామ‌ని అటవీశాఖ హెచ్చ‌రించింది.

రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను (Palapitta) సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్ప‌ష్టం చేసింది. పాలపిట్టలు గాల్లో ఎగురుతూనే ఆహారం తీసుకుంటాయని, పంజరాల్లో బంధిస్తే తిండి తినలేక చనిపోయే ప్రమాదం ఉంటుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గత దసరాకు అక్రమంగా బంధించిన 28 పాలపిట్టలను రక్షించి అడవుల్లో వదిలినట్లు వెల్ల‌డించింది. రాజధాని పరిధిలోని కేవలం మూడు జిల్లాల్లో సంచరిస్తున్న అతి ప్రాధాన్యమున్న 104 పక్షి జాతుల్లో పాలపిట్ట కూడా ఒకటని, అందువ‌ల్ల రాష్ట్ర ప‌క్షిని సంర‌క్షించుకోవాల్సి ఉంద‌ని తెలిపింది. గ‌తంలో చెరువులు, జ‌లాశ‌యాల వద్ద పాల‌పిట్ట‌లు పదుల సంఖ్యలో కనిపించేవి. ఇప్పుడు ఒకటి, రెండు కూడా కనిపించడం లేదు. పట్టణీకరణ, ఇతర కారణాలతో వీటి సంఖ్య ఏటా 30 శాతం తగ్గుతూ వస్తున్న‌ది.

బంధిస్తే మూడేండ్ల జైలు..

మ‌రోవైపు అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న పాల‌పిట్ట‌ను బంధించడం చట్టరీత్యా నేరం. అలా చేసిన వారు కఠిన శిక్షకు అర్హులు. పాలపిట్టను బంధించినా, హింసించిన వారిపై నాన్​బెయిలబుల్​ కేసులు న‌మోదుచేస్తారు. అలాంటివారికి రూ.25 వేలు జరిమానా, మూడేండ్ల‌ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement
Advertisement