Iranian Ship | అమెరికా దాడుల వేళ శ్రీలంక వైపు మరో ఇరాన్ యుద్ధ నౌక.. దీన్ని కూడా పేల్చేస్తారా..?
Iranian Ship | ఇరాన్‌కు చెందిన మరో నౌక (Iranian Ship) శ్రీలంక దిశగా పయనిస్తున్నట్లు (2nd Iranian Ship) తెలిసింది. ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా (Nalinda Jayatissa) వెల్లడించారు.
International | Published On Mar 5, 2026, 4.10 pm IST
Iranian Ship | ఇరాన్ (Iran) యుద్ధనౌకను శ్రీలంక (Sri Lanka) తీరంలోని హిందూ సహాసముద్రంలో అమెరికా సబ్‌మెరైన్ పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే ఇరాన్‌కు చెందిన మరో నౌక (Iranian Ship) శ్రీలంక దిశగా పయనిస్తున్నట్లు (2nd Iranian Ship) తెలిసింది. ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా (Nalinda Jayatissa) వెల్లడించారు. ఈ నౌకలో దాదాపు 100 మందికిపైగా సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు ఈ నౌక అత్యవసర పోర్ట్ కాల్ కోసం ప్రభుత్వ అనుమతి కోరిందని, క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నట్లు శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్సా (Namal Rajapaksa) వెల్లడించారు. దీంతో ఈ నౌకను కూడా అమెరికా పేల్చేస్తుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, హిందూ మహాసముద్రంలో మౌడ్జ్ క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన ఇరాన్ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' (IRIS Dena)పై అమెరికా బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో నావికా విన్యాసాలు ముగించుకుని స్వదేశానికి పయనమైన ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి (US Submarine) అమాంతం సముద్రంలో ముంచేసింది. దాడి సమయంలో అందులో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కొందరిని శ్రీలంక నేవీ కాపాడగా.. సుమారు 80 మందికిపైగా నావికులు జలసమాధి అయ్యారు. ఫిబ్రవరి 16న భారత నావికాదళం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జరిగే అతిపెద్ద నావికా విన్యాసాలలో ఒకటైన 'మిలాన్ 2026' సముద్ర భద్రత, యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఎయిర్ డిఫెన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి కీలక ఆపరేషన్లపై దృష్టి సారించింది. ఇంతటి ముఖ్యమైన విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న నౌకను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఇరాన్ నుంచి భారత్‌కు వస్తున్నప్పటి నుంచే అమెరికా జలాంతర్గామి ఈ నౌకను ట్రాక్ చేస్తూ ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఇరాన్ ప్రతీకార దాడి చేసి బదులు తీర్చుకుంది.
Also Read..
రాజ్యసభకు నామినేషన్ వేసిన నితీశ్ కుమార్
గల్ఫ్‌లో అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
గ్యాస్ సరఫరాపై యుద్ధ ప్రభావం.. భారత్‌లో 30 రోజులకు సరిపడా మాత్రమే ఎల్పీజీ నిల్వలు..!
సంబంధిత వార్తలు

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

IPL 2026 | బ్రైడన్ కార్సీ అవుట్.. మధుషంక ఇన్.. హైదరాబాద్ జట్టులోకి శ్రీలంక బౌలర్..!
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



