Iran hits US tanker | గల్ఫ్‌లో అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
Iran hits US tanker | హిందూ సహాసముద్రంలో ఇరాన్ (Iran) యుద్ధనౌకపై అమెరికా దాడికి టెహ్రాన్ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. గల్ఫ్‌లో అమెరికా ట్యాంకర్‌పై (American tanker) దాడి చేసింది.
International | Published On Mar 5, 2026, 2.40 pm IST
Iran hits US tanker | హిందూ సహాసముద్రంలో ఇరాన్ (Iran) యుద్ధనౌకపై అమెరికా దాడికి టెహ్రాన్ తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. గల్ఫ్‌లో అమెరికా ట్యాంకర్‌పై (American tanker) దాడి చేసింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) గురువారం ప్రకటించింది. ఉత్తర పర్షియన్ గల్ఫ్ (northern Persian Gulf)లో అమెరికా ట్యాంకర్‌పై దాడి (Iran hits US tanker) చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో నౌకలో మంటలు చెలరేగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' (IRIS Dena)పై దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి అమెరికా పశ్చాత్తాపపడాల్సి వస్తుందని, బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. 130 సెయిలర్లతో ఉన్న భారతీయ నౌకాదళ అతిథిని అంతర్జాతీయ జలాల్లో ఎటువంటి హెచ్చరిక ఇవ్వకుండానే పేల్చివేసినట్లు ఆయన ఆరోపించారు.
హిందూ మహాసముద్రంలో మౌడ్జ్ క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన ఇరాన్ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' (IRIS Dena)పై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో నావికా విన్యాసాలు ముగించుకుని స్వదేశానికి పయనమైన ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి (US Submarine) అమాంతం సముద్రంలో ముంచేసింది. దాడి సమయంలో అందులో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కొందరిని శ్రీలంక నేవీ కాపాడగా.. సుమారు 80 మందికిపైగా నావికులు జలసమాధి అయ్యారు. ఫిబ్రవరి 16న భారత నావికాదళం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జరిగే అతిపెద్ద నావికా విన్యాసాలలో ఒకటైన 'మిలాన్ 2026' సముద్ర భద్రత, యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఎయిర్ డిఫెన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి కీలక ఆపరేషన్లపై దృష్టి సారించింది. ఇంతటి ముఖ్యమైన విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న నౌకను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఇరాన్ నుంచి భారత్‌కు వస్తున్నప్పటి నుంచే అమెరికా జలాంతర్గామి ఈ నౌకను ట్రాక్ చేస్తూ ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఇరాన్ ప్రతీకార దాడి చేసి బదులు తీర్చుకుంది.
Also Read..
సంబంధిత వార్తలు

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



