Allu Arjun | శ్రీలంకలో అల్లు అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్ – కూతురి కోసం రాకా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన బన్నీ
అల్లు అర్హ బర్త్‌డే సందర్భంగా కూతురికి ఎమోషనల్‌గా విషెస్ చెబుతూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అల్లు అర్హ బర్త్‌డే వేడుకలను శ్రీలంకలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకల కోసం రాకా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు బన్నీ.
Entertainment | Published On Nov 21, 2026, 5.05 pm IST
Allu Arjun |కూతురు అల్లు అర్హ బర్త్‌డే వేడుకల కోసం రాకా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు అల్లు అర్జున్. కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లారు. శనివారం నాడు అల్లు అర్హ పదో పుట్టినరోజును జరుపుకోబోతుంది. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాకా షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన బన్నీ భార్య స్నేహారెడ్డితో పాటు కుటుంబసభ్యులతో కలిసి శ్రీలంక వెళ్లారు. అక్కడే అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు సమాచారం.
నా జీవితంలో ఆనందం నువ్వే
అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా కూతురికి ఎమోషనల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పారు బన్నీ. "నా జీవితంలో ఆనందం నువ్వే" అంటూ అర్హతో దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బన్నీ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్హ ముద్దు ముద్దు మాటలతో కూడిన వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు బన్నీ. ఈ వీడియోలు చాలా సార్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
శాకుంతలంతో...
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'శాకుంతలం సినిమాతో అర్హ బాలనటిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఐదేళ్ల వయసులోనే 'ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన చెస్ ట్రైనర్‌గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది.
రాకా...
ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో రాకా సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Priyanka Chopra | “వారణాసి”కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డబ్బింగ్ – కండీషన్ పెట్టిన రాజమౌళి
నవంబర్ 21, 2026

Ramayana | రామాయణంలోని మరో కోణం – లక్ష్మణుడి కథతో సినిమా – షూటింగ్ మొత్తం ఏఐతోనే…
నవంబర్ 21, 2026

Idupu Kayitham | ఇడుపుకాయితం నుంచి పెళ్లి పాట రిలీజ్ – ఐదుగురు సింగర్లతో….
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ
- ●AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
- ●MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నా.. ప్రజల కోసం యుద్ధం చేస్తా
- ●IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..
- ●Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!
- ●PM Modi Gamcha Swirl Vaishali | ఓపెన్ వాహనంలో మోదీ 'గమ్చా' మేనియా.. గంగా నదిపై భారీ బ్రిడ్జికి 'నితీశ్ సేతు' పేరు

Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ

AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నా.. ప్రజల కోసం యుద్ధం చేస్తా

IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..



