Nitish Kumar | రాజ్యసభకు నామినేషన్ వేసిన నితీశ్ కుమార్
Nitish Kumar | జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇవాళ రాజ్యసభ (Rajya Sabha) ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు.
Nitish Kumar | జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇవాళ రాజ్యసభ (Rajya Sabha) ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఇతర నేతలతో కలిసి ఇవాళ నామినేషన్ వేశారు. అంతకు ముందు తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు నితీశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు.
"రెండు దశాబ్దాలకుపైగా నాపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలిచారు. ఆ నమ్మకంతోనే అంకితభావంతో పనిచేయగలిగాము. నా పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే మనసులో ఒక కోరిక ఉండేది. రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలకు (అసెంబ్లీ, కౌన్సిల్), పార్లమెంట్‌లో రెండు సభలకు (లోక్‌సభ, రాజ్యసభ) ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నాను. ఆ ఆకాంక్షకు అనుగుణంగానే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. బీహార్‌తో నాకున్న అనుబంధం భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నాను. బీహార్ అభివృద్ధికై పనిచేయాలన్న నా సంకల్పం ఎప్పటికీ చెక్కుచెదరదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నా పూర్తి సహకారం ఉంటుంది" అని నితీశ్ కుమార్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను బీజేపీ కూటమి 202 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అందులో బీజేపీకి 89 సీట్లు రాగా, జేడీయూ 85 చోట్ల, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) 19 స్థానాలచొప్పున గెలుపొందాయి. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలు మాత్రమే కొనసాగిన నితీశ్ కుమార్ తాజాగా తన పదవి నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్తుండటం గమనార్హం. దీంతో సీఎంగా తన 22ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడుతుంది. ఇప్పటి వరకు బీహార్ సీఎంగా నితీశ్ 10 సార్లు పనిచేశారు.
కుర్మి వర్గానికి చెందిన నితీశ్ కుమార్ 1951, మార్చి 1న జన్మించారు. 1972లో బీహార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి నితీశ్ మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. తొలుత బీహార్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ సోషలిస్టు నాయకులైన జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఎస్‌ఎన్ సిన్హా, వీపీ సింగ్‌లతో కలిసి పనిచేశారు.
Also Read..
Rajya Sabha | రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ
Iran hits US tanker | గల్ఫ్‌లో అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
మే 7, 2026

CM Revanth Reddy | నితీష్ గతే చంద్రబాబుకు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



