KTR | చర్చించే దమ్ము లేక సీఎం, మంత్రులు పారిపోతున్నారు : కేటీఆర్
KTR | రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చర్చించే దమ్ములేకనే ముఖ్యమంత్రి, మంత్రులు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చర్చించే దమ్ములేకనే ముఖ్యమంత్రి, మంత్రులు పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేసిన అనంతరం తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గన్ పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చ కోసం గన్ పార్క్‌కు బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కంచన్‌బాగ్‌కు వెళ్లి అరెస్ట్ అయిన మా బీఆర్ఎస్ నేతలను పరామర్శిద్దామని అనుకున్నా.. అడుగు బయటపెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారు. అక్కడ కూర్చొని మంత్రులు సవాల్ విసరడం.. ఇక్కడ పోలీసులతో అడ్డుకోవడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇంత భయం ఎందుకు.. కావాలంటే అసెంబ్లీ పెట్టండి..
సంక్షేమ శాఖలో రూ.2000 కోట్ల కుంభకోణంపై హరీష్ రావు ఆరోపణలు చేస్తే చర్చ కోసం ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మని అన్నారు. ముగ్గురు మంత్రులతో మాట్లాడడానికి హరీష్ రావు బయలుదేరితే తెలంగాణ భవన్ బయటే అరెస్ట్ చేశారు. ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్ దగ్గరికి వస్తానని చెప్పి పారిపోయాడు.. ముగ్గురు మంత్రులు ఏమో గన్ పార్కు వద్దకు రమ్మని అరెస్ట్ చేయిస్తున్నారు. ఇంత భయం ఎందుకు.. కావాలంటే అసెంబ్లీ పెట్టండి. అక్కడే చర్చిద్దామని కేటీఆర్ పేర్కొన్నారు.
చేతకాని వెధవలు ఎవరో ప్రజలు చూస్తున్నారు
తెలంగాణ భవన్‌కి వస్తానని ఫోజులు కొట్టమన్నది ఎవరు.. మళ్లీ గన్ పార్క్ అని లొకేషన్ మార్చామన్నది ఎవరు. నీకంటే పోలీస్ వాళ్ల ఎస్కార్ట్ ఉంది.. కానీ మమ్మల్ని ఏమో బైటకి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులని ఎవరు పంపుతున్నారు.. ముఖ్యమంత్రా లేదా మంత్రులా..? చర్చలని మీరే పిలుస్తారు.. మళ్లీ పారిపోయేది మీరే. చేతకాని వెధవలు ఎవరో ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా గన్ పార్క్ దగ్గర ఉండు మేము వస్తాము.. మళ్లీ మీ పోలీస్ వాళ్ళని పిలిచి అరెస్ట్ చేయించొద్దు అని కేటీఆర్ సూచించారు.
నిద్ర పోయే వాడిని లేపొచ్చు..
నిద్ర పోయే వాడిని లేపొచ్చు.. నిద్రని నటించే వాడిని ఎక్కడ లేపగలం. రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేదు. గతంలో రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి మేము ప్రెస్ క్లబ్‌కు వెళ్తే రాకుండా ముఖం చాటేసి పారిపోయాడు. మరోసారి తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే మేము సిద్దమని చెప్పాం.. మళ్లీ రాకుండా తొకముడిచి పారిపోయాడు. మద్యలో సందట్లో సడేమియా అని మంత్రి జూపల్లి దూరి తెలంగాణ భవన్‌కు వస్తానని డైలాగులు వేశాడు. ఆయన కోసం మేము ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చుంటే రాకుండా ఇప్పుడు ఎక్కడో కూర్చొని సేమ్ డైలాగులు వేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



