Janhvi Kapoor | హాలీవుడ్ రొమాంటిక్ మూవీ రీమేక్‌లో జాన్వీకపూర్ – అబ్బాయి ఆత్మ అందమైన అమ్మాయిలోకి ప్రవేశిస్తే!
పెద్ది తర్వాత జాన్వీ కపూర్ ఓ హాలీవుడ్ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన రొమాంటిక్ కామూడీ మూవీ ఇట్స్ ఏ బాయ్ గర్ల్ థింగ్ ఆధారంగా హిందీలో ఓ సినిమా రానుందట. ఈ రీమేక్‌లో జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ జంటగా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Janhvi Kapoor | ఇటీవలే పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది జాన్వీ కపూర్. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీలో అచ్చియమ్మగా కథలో ఎలాంటి ప్రాముఖ్యతలేని గ్లామర్ పాత్రలో జాన్వీ మెరిసింది. ఆమె పాత్రను చూపించిన తీరుపై సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు వచ్చాయి. జాన్వీ రోల్ వివాదం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలను కుదిపేసింది.
హాలీవుడ్ రీమేక్...
పెద్ది సినిమాతో వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని జాన్వీకపూర్ నిర్ణయించుకుందట. తాజాగా ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కల్ట్ క్లాసిక్...
2006లో రిలీజైన ఇట్స్ ఏ బాయ్ గర్ల్ థింగ్ మూవీ హాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో కెవిన్ జెగర్స్, సమైర్ ఆర్మ్‌స్ట్రాంగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. బాడీ స్వాప్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ హాలీవుడ్ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. వుడీ, నెల్ ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి ఓ పాతకాలం నాటి మ్యూజియంకు ఇద్దరూ వెళతారు. ఓ దేవత విగ్రహం కారణంగా వుడీ ఆత్మ నెల్‌లోకి...నెల్ ఆత్మ వుడీలోకి ప్రవేశిస్తుంది. ఈ బాడీ స్వాప్ కారణంగా ఇద్దరికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? శత్రువుల నుంచి ప్రేమికులుగా వుడీ, నెల్ ఎలా మారారు అన్నదే ఈ సినిమా కథ.
జాన్వీ కపూర్...
దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇట్స్ ఏ బాయ్ గర్ల్ థింగ్ మూవీ బాలీవుడ్‌లోకి రీమేక్ కాబోతున్నట్లు సమాచారం. ఈ రీమేక్‌లో జాన్వీకపూర్, షాహిద్‌కపూర్ జంటగా కనిపించబోతున్నారట. జెన్‌జీ ఆడియెన్స్‌కు అభిరుచులకు తగ్గట్లుగా కాస్త రొమాంటిక్, ఫన్ డోస్‌ను పెంచి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. జాన్వీ రోల్ టామ్‌బాయ్‌లా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ హాలీవుడ్ రీమేక్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం లగ్ జా గాలే సినిమా షూటింగ్‌తో జాన్వీ బిజీగా ఉంది. ఈ యాక్షన్ కామెడీ సినిమాలో టైగర్ ష్రాఫ్, లక్ష్య హీరోలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kiara Advani | డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న రాఘవేంద్రరావు మాజీ కోడలు – కియారా అద్వానీతో బాలీవుడ్ మూవీ
ఆగస్టు 18, 2026

Taapsee | తల్లి పాత్రలో తాప్సీ – గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్
ఆగస్టు 18, 2026

Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



