త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hospital Fire | ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 మంది న‌వ‌జాత శిశువులు స‌జీవ‌ద‌హ‌నం

Hospital Fire | పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌లోని ఓ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి (Islamabad hospital)లో భారీ అగ్నిప్ర‌మాదం (Hospital Fire) సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది న‌వ‌జాత శిశువులు (15 babies killed) స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు.

D

International | Published On Aug 26, 2026, 11.03 am IST

Hospital Fire | ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 మంది న‌వ‌జాత శిశువులు స‌జీవ‌ద‌హ‌నం
Advertisement

Hospital Fire | త్రినేత్ర‌.న్యూస్ : పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజ‌ధాని ఇస్లామాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదం (Hospital Fire) సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది న‌వ‌జాత శిశువులు (15 babies killed) స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు.

స్థానిక మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ప్రభుత్వ ఆసుపత్రిలో బుధ‌వారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలడంతో (AC compressor blast) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు ఇత‌ర విభాగాల‌కు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులో 16 మంది నవజాత శిశువులు ఉన్నారు. వారిలో 15 మంది స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఒక‌రిని సిబ్బంది సుర‌క్షితంగా ర‌క్షించిన‌ట్లు జియో టీవీని ఉటంకిస్తూ రాయిట‌ర్స్ వార్తా సంస్థ నివేదించింది.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. తీవ్రంగా శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చింది. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయక చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపేందుకు అద‌న‌పు డిప్యూటీ క‌మిష‌న‌ర్ అధ్య‌క్ష‌త‌న ఒక విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు స్థానిక యంత్రాంగం తెలిపింది.

Also Read..

భార‌త్ ధ‌ర్మ‌శాల కాదు.. ఇక్క‌డ నివ‌సించే హ‌క్కు దేశ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ఉంది : అమిత్ షా

న‌టికి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగ‌న కౌంట‌ర్‌

క్రూడ్‌ ధరలు, గ్లోబల్‌ సంకేతాలతో లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Advertisement
Advertisement