Sridhar Vembu Zoho | అమెరికాలో గ్రీన్ కార్డ్ పాట్లు: ‘ఆత్మగౌరవం ముఖ్యం.. మన ఇండియాకు తిరిగి వచ్చేయండి’ జొహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఎమోషనల్ అప్పీల్
అమెరికా కొత్త గ్రీన్ కార్డ్ నిబంధనలతో ఇబ్బంది పడుతున్నారా? "ఆత్మగౌరవం ముఖ్యం.. తిరిగి ఇండియాకు వచ్చేయండి" అంటూ ఎన్ఆర్ఐలకు జొహో సీఈవో శ్రీధర్ వెంబు ఎమోషనల్ అప్పీల్ చేశారు.
- గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సొంత దేశానికి తిరిగి వెళ్లాల్సిందేనని అమెరికా ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది
- ఈ నేపథ్యంలో జొహో (Zoho) ఫౌండర్ శ్రీధర్ వేంబు అమెరికాలో వీసాలపై ఉన్న భారతీయులకు ఎమోషనల్ అప్పీల్ చేశారు
- కష్టాలు, త్యాగాలు ఎదురైనా.. ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని మాతృభూమికి తిరిగి రావాలని కోరారు
- అందరం కలిసికట్టుగా మన దేశంలో అవకాశాలు సృష్టించుకుంటూ ఇండియాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు
Sridhar Vembu Zoho | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో స్థిరపడాలని కలలు కంటూ దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ (Green Card) కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, నిపుణులకు జొహో (Zoho) సంస్థల ఫౌండర్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబు కీలక పిలుపునిచ్చారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా తీసుకొచ్చిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ రూల్స్ నేపథ్యంలో, హెచ్1బీ (H1B) లాంటి వర్క్ వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయులంతా ఆత్మగౌరవంతో స్వదేశానికి తిరిగి రావాలని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
'లొసుగులకు చెక్' అంటున్న అమెరికా
ఇటీవల యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇమ్మిగ్రేషన్ విధానాలపై సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ పొందాలనుకునే వారు కచ్చితంగా తమ సొంత దేశానికి వెళ్లి, అక్కడి నుంచే దరఖాస్తు (Consular processing) చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇకపై లొసుగులను వాడుకుంటూ, ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేసే రోజులు పోయాయని ఘాటుగా హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం అమెరికాలో ఉంటూ చేసుకునే 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' (Adjustment of Status) ను కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు.
'దయచేసి ఇంటికి రండి..'
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం టెక్, రీసెర్చ్, కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ పరిణామాలపై ఐఐటీయన్ అయిన శ్రీధర్ వేంబు ఎక్స్‌లో ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యారు. మొదటి నుంచీ స్వదేశంలో అవకాశాల కల్పనను ప్రోత్సహించే ఆయన.. మరోసారి ఎన్ఆర్ఐలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
"అమెరికాలో వీసాలపై ఉన్న భారతీయులకు నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇంటికి రండి" అని ఆయన పోస్ట్ చేశారు.
ఆత్మగౌరవమే ముఖ్యం
ఇండియాకు తిరిగి రావడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని, ప్రొఫెషనల్‌గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడొద్దని ఆయన సూచించారు. "ఇది మీకు కష్టంగా, ఒక త్యాగంగా అనిపించినా సరే.. ఆత్మగౌరవం (Self-respect) అనేది మీ ప్రయాణాన్ని నిర్దేశించాలి. మన భారత్‌ను గర్వపడేలా చేద్దాం" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. విదేశీ గడ్డపై కంఫర్ట్ కోసం రాజీ పడకుండా, సొంత దేశంలో అవకాశాలు సృష్టించుకోవాలని, ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని వెంబు ఆకాంక్షించారు.
గ్రీన్ కార్డ్ నిరీక్షణతో విసిగిపోయిన ఎంతోమంది భారతీయులకు శ్రీధర్ వెంబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Once again, my appeal to Indians in America on a visa. Please come home. Even if you feel it is hardship and sacrifice, self-respect should dictate your course. Let's make Bharat proud 🙏 https://t.co/u1Zgqck6m7
— Sridhar Vembu (@svembu) May 23, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Green Card Rules | అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలపై యూ-టర్న్: భారతీయ టెకీలు, H-1B వీసాదారులకు భారీ ఊరట
మే 30, 2026

US Green Card Rules | అమెరికా గ్రీన్ కార్డ్ ఆశావహులకు భారీ షాక్.. స్వదేశానికే వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి
మే 23, 2026

Zoho layoffs | జోహోలో లేఆఫ్స్ కలకలం: ముందస్తు నోటీసులు లేకుండా 300 మంది ట్రైనీల తొలగింపు
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



