త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Missing | వాకింగ్‌కు వెళ్లి.. అమెరికాలో నల్ల‌గొండ‌ యువతి మిస్సింగ్‌

Missing | ఉన్నత చదువుల కోసం అమెరికా (USA) వెళ్లిన నల్ల‌గొండ (Missing) జిల్లా యువతి అదృశ్యమైంది. ఈ నెల 2 సాయంతం వాకింగ్‌కు వెళ్లిన యువ‌తి మ‌ళ్లీ తిరిగి రాలేదు.

G

Telangana | Published On Nov 6, 2026, 6.48 am IST

Missing | వాకింగ్‌కు వెళ్లి.. అమెరికాలో నల్ల‌గొండ‌ యువతి మిస్సింగ్‌
Advertisement

Missing | త్రినేత్ర న్యూస్‌: ఉన్నత చదువుల కోసం అమెరికా (USA) వెళ్లిన నల్ల‌గొండ (Missing) జిల్లా యువతి అదృశ్యమైంది. ఈ నెల 2 సాయంతం వాకింగ్‌కు వెళ్లిన యువ‌తి మ‌ళ్లీ తిరిగి రాలేదు. ఇప్ప‌టివ‌రకు ఆమె గురించి ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

న‌ల్ల‌గొండ జిల్లా కనగల్‌ (Kanagal) మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ్య యాదగిరిరెడ్డి, రూప దంపతుల కుమార్తె శ్రీజ(23). ఉన్నత విద్య అభ్యసించేందుకు గ‌తేడాది ఏడాది అమెరికాలోని బోస్టన్‌కు (Boston) వెళ్లారు. మ‌సాచూసెట్స్ యూనివ‌ర్సిటీలో (University of Massachusetts) మాస్ట‌ర్స్ చేస్తూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నారు. ఈ నెల 2న సాయంత్రం నడకకు వెళ్లిన శ్రీజ తిరిగి రాలేదు. దీంతో ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రీజ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ సమీపంలోని బీచ్‌ ప్రాంతంలో చూపిస్తున్న‌దని.. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదన్నారు. నాలుగు రోజులుగా కుమార్తె వివ‌రాలు తెలియ‌క‌పోవ‌డంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
Advertisement