Singireddy Niranjan Reddy | రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా..? హరీష్‌రావు గృహనిర్బంధాన్ని ఖండించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Singireddy Niranjan Reddy | బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు (house arrest) చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) తీవ్రంగా ఖండించారు.
Singireddy Niranjan Reddy | బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు (house arrest) చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు గృహ నిర్బంధం అక్రమం అని, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే ఈ సర్కార్‌కు భయం ఎందుకని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా..? అంటూ నిలదీశారు.
అధికారం చేతిలో ఉందని ఈ ప్రభుత్వం అక్రమంగా రైతుల భూముల చెరబడుతున్నదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు .. ఒక్క ఇటుక పేర్చింది లేదని విమర్శించారు. కానీ భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుందని మండిపడ్డారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు భరోసా ఇవ్వడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధం సిగ్గు చేటు అని విమర్శించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. కాంగ్రెస్ నేతలు భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత అణచివేసినా ప్రజలు, రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
హరీశ్ రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పరిగిలో (Parigi) ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor) బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. హరీశ్ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలువురు బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామ శివారులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకోసం ప్రభుత్వం 1,197 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో రాపోలు గ్రామంలో 610 ఎకరాలు కాడ్లాపూర్‌లో 587 ఎకరాలు ఉన్నాయి. వీటిలో 260 ఎకరాలు పట్టా భూములు కాగా, 937 ఎకరాల లావణి పట్టా భూములు. దీంతో తమకు జీవనాధారమైన భూములు లాక్కొవద్దని రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా వారికి మద్దతు తెలిపేందుకుగాను పరిగి వెళ్తున్న హరీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు.
Also Read..
Kevin Pietersen | ఐపీఎల్‌లో ఆడడం వల్ల నా క్రికెట్ కెరీర్ ముగిసింది: కెవిన్ పీటర్సన్
నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ తాజా హెచ్చరికలే కారణమా..?
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పరిగి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
సంబంధిత వార్తలు

BJP chief Ramchandar Rao | నిన్నటి ఓటింగ్‌ను మహిళల ఓటమిగానే భావిస్తం: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
ఏప్రిల్ 18, 2026

Singireddy Niranjan Reddy | పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఏప్రిల్ 15, 2026

Sridhar Babu | రైతులను తప్పుదోవ పట్టించేందుకే రాజకీయ యాత్రలు : శ్రీధర్ బాబు
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



