Stock Markets | నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ తాజా హెచ్చరికలే కారణమా..?
Stock Markets | మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 372.49 పాయింట్లు (0.50 శాతం) పడిపోయి 73,734.36 వద్ద ప్రారంభమైంది. అలాగే నిఫ్టీ 50 సూచీ 129.55 పాయింట్లు (0.56 శాతం) తగ్గి 22,838.70 వద్ద ప్రారంభమైంది.
Stock Markets | మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 372.49 పాయింట్లు (0.50 శాతం) పడిపోయి 73,734.36 వద్ద ప్రారంభమైంది. అలాగే నిఫ్టీ 50 సూచీ 129.55 పాయింట్లు (0.56 శాతం) తగ్గి 22,838.70 వద్ద ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ కూడా 350.40 పాయింట్లు (0.67 శాతం) తగ్గి 52,258.70 వద్ద ప్రారంభమైంది. విస్తృత మార్కెట్లు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.5 శాతం తగ్గగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.2 శాతం పెరిగింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్స్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరికలు..
అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా గత రాత్రి లాభాలతో ముగిశాయి. వాల్ స్ట్రీట్‌లోని మూడు ప్రధాన సూచీలు లాభపడ్డాయి. ముడి చమురు ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.52 శాతం పెరిగి బ్యారెల్‌కు 111.44 డాలర్లకు చేరగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.71 శాతం పెరిగి 115.46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో జూన్ డెలివరీ గోల్డ్ రేటు 0.14 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,49,759 వద్ద ప్రారంభమైంది. ఇది గత ముగింపు ధర రూ.1,49,981తో పోలిస్తే తక్కువ. అలాగే మే ఫ్యూచర్స్ ఎంసీఎక్స్ వెండి ధర 0.59 శాతం తగ్గి కిలోకు రూ.2,32,000 వద్ద ప్రారంభమైంది. ఇది గత ముగింపు ధర రూ.2,33,379 కంటే తక్కువ.
అస్థిరంగా బంగారం ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హార్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై అమెరికా గడువు నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,646.69 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, జూన్ డెలివరీ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 4,674.40 డాలర్ల వద్దకు చేరాయి. స్పాట్ సిల్వర్ ధర 0.9 శాతం తగ్గి ఔన్స్‌కు 72.11 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | పెరిగిన టారిఫ్ భయాలు, ముడి చమురు ధరలు.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
నవంబర్ 27, 2026

Stock Markets | ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
నవంబర్ 27, 2026

Stock Markets | 10 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



