త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పరిగి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

Harish Rao | బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప‌రిగిలో (Parigi) ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ (Industrial Corridor) బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

G

Telangana | Published On Apr 7, 2026, 9.39 am IST

Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పరిగి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప‌రిగిలో (Parigi) ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ (Industrial Corridor) బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. హరీశ్ నివాసం వద్ద పెద్ద సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. ఇప్ప‌టికే ప‌రిగి మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప‌లువురు బీఆర్ఎస్‌ నేతలను గృహ నిర్బంధం చేశారు.

వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌లం రాపోలు గ్రామ శివారులో ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ ఏర్పాటుకోసం ప్ర‌భుత్వం 1,197 ఎక‌రాల భూమిని సేక‌రించేందుకు నోటిఫికేష‌న్ జారీచేసింది. ఇందులో రాపోలు గ్రామంలో 610 ఎక‌రాలు కాడ్లాపూర్‌లో 587 ఎక‌రాలు ఉన్నాయి. వీటిలో 260 ఎకరాలు పట్టా భూములు కాగా, 937 ఎకరాల లావణి పట్టా భూములు. దీంతో తమకు జీవనాధారమైన భూములు లాక్కొవద్దని రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఇందులో భాగంగా వారికి మద్ద‌తు తెలిపేందుకుగాను ప‌రిగి వెళ్తున్న హ‌రీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు.

 

Advertisement
Advertisement