త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singireddy Niranjan Reddy | ఒక్క బ‌స్తా కొన‌క‌నే ధాన్యం వ‌ర్షం నీటిపాలైంది

Singireddy Niranjan Reddy | ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా నేటికీ ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేయకపోవడం వల్లనే ధాన్యం వ‌ర్షం నీటి పాలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) వాపోయారు.

S

Telangana | Published On Nov 26, 2026, 6.51 pm IST

Singireddy Niranjan Reddy | ఒక్క బ‌స్తా కొన‌క‌నే ధాన్యం వ‌ర్షం నీటిపాలైంది
Advertisement
  • త‌డిసిన, కొట్టుకుపోయిన ధాన్యానికి ప‌రిహారం ఇవ్వాలి
  • సమ్మిట్ ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న‌రు
  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Singireddy Niranjan Reddy | త్రినేత్ర న్యూస్‌: ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా నేటికీ ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేయకపోవడం వల్లనే ధాన్యం వ‌ర్షం నీటి పాలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) వాపోయారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపుతూ సమ్మిట్ ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని మండిప‌డ్డారు. నిన్న కురిసిన అకాల వ‌ర్షానికి రంగారెడ్డి, కామారెడ్డి తదితర జిల్లాల్లో వ‌రి ధాన్యం నీటిపాలైంద‌న్నారు. ప్ర‌భుత్వం స్పందించి ప‌రిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు. గురువారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు చేశారు.

సాగు నీళ్లు, కరెంటు ఇవ్వకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి కూడా భద్రత కల్పించలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 24 లక్షల 30వేల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయని ప్రకటించారు. కానీ నేటికి పరిహారం 24 పైసలు కూడా రైతులకు అందలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండిన పంటలకు, అకాల వర్షాల వల్ల తడిసిన కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించి రైతులలో ఆత్మస్థైర్యం నింపాలని డిమాండ్ చేశారు.

సాగు నీళ్లు, కరెంటు లేక లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 24 లక్షల 30వేల ఎకరాలలో పంటలు ఎండాయ‌ని చెబుతున్నాయి. శ్రీశైలం నుండి కృష్ణా జలాలు కుప్పం తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్లోబల్ సమ్మిట్ కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. రైతులను పట్టించుకోవడం లేదు. సిద్దిపేట సభలో 50 కోట్లు ఖర్చుపెట్టి కె.సి.ఆర్, హరీష్ ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయంపై రెండున్నర కోట్ల మంది ఆధారపడి ఉన్నారు.

రేవంత్ రైతులలో ఆత్మస్థైర్యం నింపడమే మరచి వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసందర్భంగా ఎన్నికలపై మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులను ఎండబెట్టి ఇసుక దందా చేస్తున్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటుంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమ‌య్యారు.

పెద్దమందడి మండలలో కె.ఎల్.ఐ సాగు నీళ్లు ఒక్క చుక్క సాగు నీళ్లు అందలేదు. కె.ఎల్.ఐ, పాలమూరు పంపులు 40 రోజులు నిర్విరామంగా నడిపిన నీళ్లు ఉన్నాయి. కె.ఎల్.ఐ నుండి 60 రోజులు నడిపిన 6 టీఎంసీల‌ నీళ్లు ఎత్తలేరు. ప్రభుత్వానికి వివేకం, విచక్షణ లేకుండా రైతుల పట్ల వివక్షత చూపుతుంది. సి.ఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. తడిసిన ధాన్యం కొని మద్దతు ధరలు చెల్లించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న‌ వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఈ సమావేశంలో వాకిటి శ్రీ‌ధర్, నందిమల్ల అశోక్, మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్, కె.మాణిక్యం, గంధం పరంజ్యోతి, రఘువర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ నాయుడు, ధర్మా నాయక్, దేవర్ల నరసింహ, సునీల్ వాల్మీకి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, సయ్యద్ జమీల్, మందరాము, బాబు నాయక్, మర్రికుంట శ్రీను, అలీం, ఖాదర్శా, వజ్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement