Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన
Uterus | ఇది వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన. స్త్రీ కడుపులో ఉండాల్సిన గర్భాశయం ఓ బాలుడి కడుపులో బయటపడింది. ఈ విచిత్రమైన కేసు వికారాబాద్ జిల్లాలోని పరిగిలో వెలుగు చూసింది.
Uterus | త్రినేత్ర న్యూస్ : ఇది వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన. స్త్రీ కడుపులో ఉండాల్సిన గర్భాశయం ఓ బాలుడి కడుపులో బయటపడింది. ఈ విచిత్రమైన కేసు వికారాబాద్ జిల్లాలోని పరిగిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు గత కొంతకాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఛత్రజీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు.. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కుడివైపు వృషణం వాపు ఉన్నట్లు గుర్తించారు. 10 ఏళ్ల క్రితం వృషణం కిందకు దిగకపోవడం సమస్యతో సర్జరీ చేయించుకున్నప్పటికీ.. ఆ సమయంలో వృషణం గుర్తించలేదు.
మొత్తానికి డాక్టర్లు మరింత లోతుగా పరీక్షలు నిర్వహించగా, బాలుడి శరీరంలో గర్భాశయాన్ని గుర్తించారు. స్త్రీ పునరుత్పత్తి అవయవం బాలుడిలో ఉండడంతో వైద్యులు షాకయ్యారు. ఈ పరిస్థితిలో పురుషుడి శారీరక లక్షణాలు ఉన్నప్పటికీ, శరీరం లోపల గర్భాశయం వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉండవచ్చు. వైద్యులు ఎంతో జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..
- ●Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?
- ●Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ
- ●BM Sandip Kumar | దేశ రాజ్యాంగం కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే
- ●WhatsApp | వాట్సాప్లో కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్..

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..

Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్

Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?

Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ




