త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB | ఏసీబీ మ‌రో పంజా.. లంచం తీసుకుంటూ చిక్కిన ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌

ACB | పెద్ద‌ప‌ల్లి జిల్లా కోర్టు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ డొంకెన ర‌వీంద‌ర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టారు.

D

Hyderabad | Published On Nov 18, 2026, 5.53 pm IST

ACB | ఏసీబీ మ‌రో పంజా.. లంచం తీసుకుంటూ చిక్కిన ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌
Advertisement

ACB | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న అవినీతి నిరోధ‌క శాఖ మ‌రోసారి త‌న పంజా విసిరింది. ఈ సారి న్యాయ‌వ్య‌వ‌స్థ‌లోని చీక‌టి కోణాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. పెద్ద‌ప‌ల్లి జిల్లా కోర్టు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ (పీపీ) (Peddapalli District Court) డొంకెన ర‌వీంద‌ర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టారు. బాధితుడి నుంచి పీపీ లంచం తీసుకుంటుండ‌గా క‌రీంన‌గ‌ర్ ఏసీబీ డీఎస్పీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలోని బృందం వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకుంది.

2023లో ధ‌ర్మారం మండ‌లం ర‌చ్చ‌ప‌ల్లిలో జ‌రిగిన భూ వివాద గొడ‌వ‌లో ఒకరు మృతి చెందారు. మృతుడి కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు న‌లుగురిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో నిందితుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి, వారికి మేలు క‌లిగేలా చూస్తాన‌ని ర‌వీంద‌ర్ రూ. రెండు ల‌క్ష‌ల లంచం డిమాండ్ చేశారు. దీంతో స‌దరు వ్య‌క్తులు ఏసీబీని ఆశ్ర‌యించారు. ఏసీబీ అధికారుల సూచ‌న మేర‌కు బాధితుడి నుంచి పెద్ద‌ప‌ల్లిలో ర‌వీంద‌ర్‌ లంచం సొమ్ము రూ.1.50 ల‌క్ష‌లు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఆయ‌న నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారుల విచార‌ణ కొన‌సాగుతోంది.

Also Read..

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్ ఏర్పాటుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయండి: సీఎస్ సంజ‌య్ జాజు

సీఎస్‌ను క‌లిసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ

Advertisement
Advertisement