త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana CS Sanjay Jaju | ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ సంజయ్ జాజు

Telangana CS Sanjay Jaju | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి (Indiramma Family Insurance Scheme) అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

D

Telangana | Published On Nov 18, 2026, 5.48 pm IST

Telangana CS Sanjay Jaju | ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ సంజయ్ జాజు
Advertisement
  • ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలు
  • రూ.2 లక్షల జీవిత బీమా రూ.5 లక్షలకు పెంపు
  • నెల రోజుల పాటు నమోదు ప్రక్రియ

Telangana CS Sanjay Jaju | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి (Indiramma Family Insurance Scheme) అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీతో పాటు అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు అమలవుతున్న బీమా పథకాలను ఇందిరమ్మ కుటుంబ బీమా పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

నేతన్నలు, గౌడ్‌లు, కార్మికులు, మత్స్యకారులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.2 లక్షల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకురావడం ద్వారా రూ.5 లక్షలకు పెంచనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భద్రత కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్హత ఉన్న‌ కుటుంబంలోని సభ్యులందరూ పథకంలో నమోదు చేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించాలని సూచించారు. పథకం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ నమోదు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

దాదాపు నెల రోజుల పాటు కొనసాగనున్న నమోదు ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, పౌర సరఫరాల కమిషనర్ నాగిరెడ్డి, కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Also Read..

హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్ ఏర్పాటుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయండి: సీఎస్ సంజ‌య్ జాజు

సీఎస్‌ను క‌లిసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ

ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం: ఎన్. రాంచందర్ రావు

Advertisement
Advertisement