త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Rides | లంచం ఇయ్య‌కుంటే చార్జిషీట్ లేటైత‌ది.. పైస‌లు ప‌ట్టుకురా

ACB Rides | కేసులు న‌మోదు చేసి బాధితుల‌కు న్యాయం చేయాల్సిన పోలీసులే అడ్డ‌దారులు తొక్కుతున్నారు. ఇటీవ‌లే ఇద్ద‌రు పోలీసుల అధికారులు ఏసీబీ(ACB)కి ప‌ట్టుబ‌డ‌గా తాజాగా మ‌రో ఎస్ఐ (SI) రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

S

Telangana | Published On Nov 9, 2026, 1.48 pm IST

ACB Rides | లంచం ఇయ్య‌కుంటే చార్జిషీట్ లేటైత‌ది.. పైస‌లు ప‌ట్టుకురా
Advertisement
  • బాధితుడిని డిమాండ్ చేసిన కీస‌ర‌ ఎస్ఐ
  • రెండు ల‌క్ష‌లు తీసుకుంటూ రెండ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన వైనం

ACB Rides | త్రినేత్ర న్యూస్: కేసులు న‌మోదు చేసి బాధితుల‌కు న్యాయం చేయాల్సిన పోలీసులే అడ్డ‌దారులు తొక్కుతున్నారు. నిజాయ‌తీగా ప‌ని చేస్తామ‌ని ప్ర‌మాణం చేసి ప‌నికిమాలిన ప‌నులకు పూనుకుంటున్నారు. ఇటీవ‌లే ఇద్ద‌రు పోలీసుల అధికారులు ఏసీబీ(ACB)కి ప‌ట్టుబ‌డ‌గా తాజాగా మ‌రో ఎస్ఐ (SI) రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ ఎస్ఐ ఎలా పట్టుబడ్డాడంటే..

ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన భూ మోసం, 498ఏ కేసుల్లో ఓ వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసుల్లో త్వరగా చార్జిషీట్లు దాఖలు చేయాలని స‌ద‌రు నిందితుడు కీస‌ర‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ను కోరాడు. అయితే చార్జిషీట్లు త్వరగా దాఖలు చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే లేటైతుంద‌ని ఎస్‌ఐ డిమాండ్ చేశాడు.

దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అయితే ముందుగా అనుకున్న‌ పథకం ప్రకారం సోమవారం ఉదయం కీసరలోని శిల్పా లేఅవుట్‌కు వచ్చి రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్‌ఐ బాధితుడికి సూచించాడు. బాధితుడి నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడి చేసి శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. అనంతరం విచారణ చేపట్టి ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపర‌చ‌నున్నారు.

గత మూడు నెలల్లోనే ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. తాజాగా కీసర ఎస్‌ఐ శ్రీనివాస్ కూడా ఏసీబీకి చిక్కడంతో ఈ వ్యవహారం తీవ్ర‌ చర్చనీయాంశ‌మైంది.

Advertisement
Advertisement