త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Loan | రూ.1.8 కోట్ల లోన్ ఇచ్చేందుకు రూ.9 ల‌క్ష‌ల లంచం.. బ్యాంకు మేనేజ‌ర్ అరెస్ట్‌

Bank Loan | త్రినేత్ర న్యూస్‌: ఆస్తిని కుదువ పెట్టుకుని రూ.కోటి లోన్‌ (Bank Loan) ఇచ్చేందుకు లంచం డిమాండ్ (Bribe) చేసిన బ్యాంకు మేనేజ‌ర్‌ను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు. అత‌నితోపాటు ఇద్ద‌రు ఏజెంట్ల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

G

National | Published On Nov 20, 2026, 11.18 am IST

Bank Loan | రూ.1.8 కోట్ల లోన్ ఇచ్చేందుకు రూ.9 ల‌క్ష‌ల లంచం.. బ్యాంకు మేనేజ‌ర్ అరెస్ట్‌
Advertisement

Bank Loan | త్రినేత్ర న్యూస్‌: ఆస్తిని కుదువ పెట్టుకుని రూ.కోటి లోన్‌ (Bank Loan) ఇచ్చేందుకు లంచం డిమాండ్ (Bribe) చేసిన బ్యాంకు మేనేజ‌ర్‌ను సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు. అత‌నితోపాటు ఇద్ద‌రు ఏజెంట్ల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్‌లో జ‌రిగింది.

డెహ్రాడూన్‌లోని (Dehradun) క్లెమెంట్ టౌన్‌కు చెందిన ఓ వ్య‌క్తి లోన్ కోసం ఇందిరానగర్‌లో ఉన్న‌ బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) బ్రాంచ్‌కు వెళ్లారు. త‌న ఆస్తిని కుదువ పెట్టి (Loan Against Property) రూ.1.8 కోట్ల రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే లోన్ మంజూరు చేసి, నిధుల‌ను రిలీజ్ చేయ‌డానికి బ్రాంచ్ మేనేజ‌ర్‌ ప్రేమ్ రంజ‌న్ రూ.9 ల‌క్ష‌లు (5 శాతం) లంచం డిమాండ్ చేశారు. ఒప్పందం మేర‌కు ఇద్ద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు (డైరెక్ట్ సెల్లింగ్‌ ఏజెంట్లు-DSAs) న‌గ‌దు, చెక్కుల రూపంలో బాధితుడు ఇప్ప‌టికే రూ.2.5 ల‌క్ష‌లు చెల్లించారు. మిగిలిన రూ.6.5 ల‌క్ష‌ల కోసం ఒత్తిడి చేయ‌డంతో బాధితుడు రూ. 3.8 లక్షలు, రూ. 2.2 లక్షల విలువైన రెండు పోస్ట్-డేటెడ్ (తేదీ లేని చెక్కులను) ఇచ్చారు. మిగిలిన రూ.50 వేలు నగదుగా ఇస్తానని చెప్పారు. అనంత‌రం సీబీఐకి ఫిర్యాదు చేశారు.

దీంతో వ‌ల ప‌న్నిన సీబీఐ అధికారులు.. ఈ నెల 18న బాధితుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏజెంట్ న‌రేంద్ర ఆర్య‌ను ప‌ట్టుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో భాగ‌స్వాములైన బ్రాంచ్ మేనేజ‌ర్ (Bank Manager) ప్రేమ్ రంజ‌న్‌, మ‌రో ఏజెంట్ నీరజ్ రాయ్‌లను కూడా అరెస్ట్ చేశారు. అనంత‌రం ముగ్గురి నివాసాల్లో సోదాలు నిర్వ‌హించి.. కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఏజెంట్ అష్రఫ్‌పై కూడా కేసు నమోదుచేశారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజ‌రుప‌రుచ‌గా, వారికి జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది.

Advertisement
Advertisement