Mahesh Kumar Goud | దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చారు.. బీజేపీ సర్కార్‌పై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : దేశంలో విద్యావిధానాన్ని (countrys education system) కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యాపారంగా మార్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : దేశంలో విద్యావిధానాన్ని (countrys education system) కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యాపారంగా మార్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. హైదరాబాద్ బోయినపల్లిలో జరిగిన ఛాత్రోం కీ గూంజ్ (Chhatron Ki Goonj) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీసీసీ చీఫ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగ, విద్యా పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేస్తూ, విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఆయనపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ నాయకుడు రాహుల్ గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల జీవితాలంటే కేంద్ర ప్రభుత్వానికి లేక్కలేదని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ విమర్శించారు. నీట్ లీకేజీతో లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. విద్యా వ్యవస్థలో పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలన్నారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పు కోసం రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోం కీ గూంజ్ కార్యక్రమంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Also Read..
రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె
సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హరీశ్ రావు
జైల్లో పెట్టినా కాంగ్రెస్ సర్కార్‌పై నా పోరాటం ఆగదు: వేముల ప్రశాంత్ రెడ్డి
సంబంధిత వార్తలు

Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ
జులై 13, 2026

Mahesh Kumar Goud | హరీశ్‌రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్
జులై 10, 2026

Tungathurthi Congress Politics | తుంగతుర్తి కాంగ్రెస్‌లో రచ్చ.. బీఆర్ఎస్ నేతలకు పట్టాభిషేకమా? పీసీసీ చీఫ్‌కు ఎంపీ చామల లేఖ
జులై 7, 2026
తాజావార్తలు
- ●Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?
- ●Google Images | గూగుల్ ఇమేజెస్‌కు 25 ఏళ్లు.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌తో భారీ అప్డేట్..
- ●Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు
- ●Errolla Srinivas | పైరవికారులు, దళారుల పాలనలా మారిన ప్రజా పాలన: ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె
- ●Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Ather Energy | రూ.1వేయి కోట్ల బూస్ట్‌తో దూసుకెళ్లిన ఏథర్ షేర్లు.. ఇంకా కొనాలా? అమ్మాలా?

Google Images | గూగుల్ ఇమేజెస్‌కు 25 ఏళ్లు.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌తో భారీ అప్డేట్..

Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు

Errolla Srinivas | పైరవికారులు, దళారుల పాలనలా మారిన ప్రజా పాలన: ఎర్రోళ్ల శ్రీనివాస్



