Google Images | గూగుల్ ఇమేజెస్‌కు 25 ఏళ్లు.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌తో భారీ అప్‌డేట్..
Google Images | గూగుల్ తన ఇమేజెస్ సేవ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రెండు కొత్త విజువల్ సెర్చ్ ఫీచర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఇమేజ్‌లను చూపించేలా పూర్తిగా కొత్తగా రూపొందించిన గూగుల్ ఇమేజెస్ హోమ్‌పేజ్ ను తీసుకువచ్చింది.
Technology | Published On Jul 15, 2026, 1.56 pm IST
Google Images | గూగుల్ తన ఇమేజెస్ సేవ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రెండు కొత్త విజువల్ సెర్చ్ ఫీచర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఇమేజ్‌లను చూపించేలా పూర్తిగా కొత్తగా రూపొందించిన గూగుల్ ఇమేజెస్ హోమ్‌పేజ్ ను తీసుకువచ్చింది. అలాగే సెర్చ్‌లోని ఏఐ ఓవర్‌వ్యూస్ లో నేరుగా ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ సందర్భంగా గత 25 ఏళ్లలో విజువల్ సెర్చ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న ముఖ్యమైన మైలురాళ్లను కూడా గూగుల్ వెల్లడించింది. కొత్తగా రూపొందించిన గూగుల్ ఇమేజెస్ హోమ్‌పేజ్ లో వెబ్ అంతటా ఉన్న చిత్రాలను రియల్‌టైమ్‌లో అప్డేట్ అవుతూ చూపించే డైనమిక్ గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీ ప్రతి వినియోగదారుడి ఆసక్తులు, సెర్చ్ అలవాట్లకు అనుగుణంగా వ్యక్తిగతీకరించి చూపిస్తుంది. దీంతో కొత్త చిత్రాలను సులభంగా బ్రౌజ్ చేయడం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
ఏఐ ఓవర్ వ్యూస్‌లో గూగుల్ ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్..
అలాగే వినియోగదారులు గతంలో సేవ్ చేసుకున్న కలెక్షన్స్ ఇప్పుడు గ్యాలరీ పైనే ప్రత్యేక ట్యాబ్‌ల రూపంలో కనిపిస్తాయి. దీంతో ఇప్పటికే సేవ్ చేసిన చిత్రాలను తిరిగి చూడడం, సంబంధిత కంటెంట్‌ను మరింత సులభంగా అన్వేషించడం సాధ్యమవుతుంది. ఇక సెర్చ్‌లోని ఏఐ ఓవర్‌వ్యూస్ కు గూగుల్ ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను తీసుకువస్తోంది. గూగుల్ అభివృద్ధి చేసిన నానో బనానా మోడల్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి నేరుగా సెర్చ్ ఫలితాల్లోనే తమకు కావాల్సిన కస్టమ్ చిత్రాలను రూపొందించుకోవచ్చు. ఈ సందర్భంగా గూగుల్ విజువల్ సెర్చ్ ప్రయాణంలోని ప్రధాన మైలురాళ్లను కూడా వెల్లడించింది. 2001లో గూగుల్ ఇమేజెస్ ప్రారంభమైంది. 2009లో సిమిలర్ ఇమేజెస్ ఫీచర్ ద్వారా ఒక చిత్రానికి సంబంధించిన ఇతర సారూప్య చిత్రాలను వెతికే అవకాశం వచ్చింది. 2011లో సెర్చ్ బై ఇమేజ్ ఫీచర్‌తో చిత్రాన్ని అప్‌లోడ్ చేయడం లేదా దాని యూఆర్ఎల్‌ను పేస్ట్ చేసి సెర్చ్ చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
అనేక ఫీచర్లతో అప్‌డేట్స్..
2018లో గూగుల్ లెన్స్ ద్వారా కెమెరా ఆధారిత విజువల్ సెర్చ్‌ను సెర్చ్‌లోకి తీసుకొచ్చింది. 2022లో మల్టీసెర్చ్ ఫీచర్‌తో టెక్స్ట్, చిత్రాలను కలిపి ఒకేసారి సెర్చ్ చేసే అవకాశం కల్పించింది. 2024లో సర్కిల్ టు సెర్చ్ ద్వారా ఆండ్రాయిడ్ స్క్రీన్‌పై కనిపించే ఏ అంశాన్నైనా వృత్తం గీయడం వంటి జెశ్చర్‌లతో సెర్చ్ చేసే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 2025లో లెన్స్ ను ఏఐ మోడ్ తో అనుసంధానం చేసి మరింత లోతైన విజువల్ అవగాహనను అందించింది. అలాగే సెర్చ్ లైవ్ ద్వారా లైవ్ కెమెరా ఫీడ్ ఉపయోగించి ఏఐతో సంభాషించే అవకాశం కల్పించింది. అదే ఏడాది ఏఐ మోడ్‌లో విజువల్ డిస్కవరీ, షాపింగ్ కోసం సంభాషణాత్మక విజువల్ ఫలితాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026లో సర్కిల్ టు సెర్చ్ లో ఒకే చిత్రంలో ఉన్న అనేక వస్తువులను ఒకేసారి గుర్తించే మల్టీ-ఆబ్జెక్ట్ రికగ్నిషన్ సామర్థ్యాన్ని జోడించింది. గూగుల్ విజువల్ ఇమేజ్ ఫ్యాన్-అవుట్ టెక్నిక్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. అలాగే ఇంటెలిజెంట్ సెర్చ్ బాక్స్ ద్వారా ఒకేసారి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలను అప్‌లోడ్ చేసి, ఏఐ మోడ్ సహాయంతో వాటిపై వివరమైన ప్రశ్నలు అడిగే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.
దశలవారీగా అందుబాటులోకి..
కొత్తగా రూపొందించిన గూగుల్ ఇమేజెస్ హోమ్‌పేజ్ వచ్చే కొన్ని వారాల్లో అమెరికాలోని డెస్క్‌టాప్ వినియోగదారులకు ఇంగ్లిష్ భాషలో దశలవారీగా అందుబాటులోకి రానుంది. ఈ అనుభవాన్ని ఉపయోగించాలంటే వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా సెర్చ్‌లోని ఏఐ ఓవర్‌వ్యూస్ లో ఏఐ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ కూడా ఇప్పటికే ఏఐ మోడ్ ఇమేజ్ జనరేషన్‌కు మద్దతు ఉన్న ప్రాంతాల్లో ఇంగ్లిష్ భాషలో వచ్చే కొన్ని వారాల్లో దశలవారీగా విడుదల కానుంది.
సంబంధిత వార్తలు

Google | వినియోగదారులకు షాకిచ్చిన గూగుల్.. యూజర్ల డేటాతో ఏఐ మోడల్స్ ట్రెయినింగ్..?
జులై 8, 2026

Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడల్.. 4 సెకన్లలో ఏఐ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది..
జులై 1, 2026

Google Search | గూగుల్ కొత్త ఫీచర్.. సెర్చ్‌లోనే క్రియేటర్లకు ప్రత్యేక ప్రొఫైల్..
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు
- ●Errolla Srinivas | పైరవికారులు, దళారుల పాలనలా మారిన ప్రజా పాలన: ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె
- ●Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Nitin Gadkari | E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్రమే : నితిన్ గడ్కరీ
- ●Harish Rao | సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హరీశ్ రావు

Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు

Errolla Srinivas | పైరవికారులు, దళారుల పాలనలా మారిన ప్రజా పాలన: ఎర్రోళ్ల శ్రీనివాస్

Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె

Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు



