Vemula Prashanth Reddy | జైల్లో పెట్టినా కాంగ్రెస్ సర్కార్‌పై నా పోరాటం ఆగదు: వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy | తన నియోజకవర్గంలోని భీంగల్‌లో అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తలపెట్టిన నిరాహాద దీక్షను (Hunger Strike) ప్రభుత్వం అడ్డుకున్నది.
Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్: తన నియోజకవర్గంలోని భీంగల్‌లో అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తలపెట్టిన నిరాహాద దీక్షను (Hunger Strike) ప్రభుత్వం అడ్డుకున్నది. ఇందులో భాగంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేసింది. ప్రభుత్వ చర్యపై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కఠోర నిరాహార దీక్షను పోలీసు బలగాలతో అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్య మండిపడ్డారు. తనను జైల్లో పెట్టినా ప్రజల కోసం కాంగ్రెస్ సర్కార్‌పై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గృహ నిర్బంధంలో (House Arrest) ఉన్నా తన దీక్ష కొనసాగుతుందన్నారు. భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మంజూరై, దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్ (Bheemga) 100 పడకల దవాఖాన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, భీంగల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్ బస్ డిపోను పునఃప్రారంభించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు రూ.12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ పెండింగ్ పనుల సాధన కోసమే చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా, తనకు తాను శిక్ష వేసుకుంటూ ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటిస్తే ప్రభుత్వం (Congress Govt) ఎందుకు ఉలిక్కిపడుతున్నదని ప్రశ్నించారు. తాను నిద్రలేవక ముందే వందలాది మంది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా గొంతు నొక్కలేరు, జైల్లో పెట్టినా ప్రజల కోసం కాంగ్రెస్ సర్కార్ పై నా పోరాటం ఆగదు.
గృహ నిర్బంధంలో ఉన్నా నా దీక్ష కొనసాగుతుంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే శాంతియుత దీక్ష.. పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికం.
భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా?
— BRS Party (@BRSparty) July 15, 2026
సంబంధిత వార్తలు

Dhirendra Ojha PIB | పీఐబీ చీఫ్‌గా ధీరేంద్ర ఓజా పదవీకాలం మరో ఏడాది పొడిగింపు: కేంద్ర కేబినెట్ ఆమోదం
సెప్టెంబర్ 30, 2026

CM Revanth Reddy | బీఆర్ఎస్ పాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల
సెప్టెంబర్ 30, 2026

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం
- ●Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్
- ●Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!
- ●TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం
- ●One Nation One Election | ఒకే దేశం..ఒకే ఎన్నిక.. 2029లోనా ? 2034లోనా?
- ●Faria Abdullah | డైరెక్షన్ వైపు ఫరియా చూపు.. స్క్రిప్ట్ పనిలో చిట్టీ బిజీబిజీ..!

Talasani Srinivas Yadav | ఎమ్మెల్సీ బరిలో బీసీలకు మొండిచేయి: కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలి.. మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం

Kayadu Lohar | కయదు ఆశలు అడియాశలే.. ప్యారడైజ్ కూడా దక్కని బ్రేక్

Janhvi Kapoor | గ్లామర్‌కు దూరంగా.. జాన్వీ కొత్త అడుగులు!

TOMCOM Dubai Jobs | దుబాయ్‌లో ఉద్యోగాలు: నెలకు రూ.44 వేల వరకు జీతం.. అక్టోబర్ 4న ఇంటర్వ్యూలు.. తెలంగాణ వాళ్లకే అవకాశం



