త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హ‌రీశ్ రావు

Harish Rao | సీఎం రేవంత్‌కు (Revanth Reddy) హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ అని హెల్త్ కార్డుల (Health Cards) విషయంలో మరోసారి నిరూపితమైంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రేవంత్ స‌ర్కార్ తీరు కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుంద‌న్నారు.

G

Telangana | Published On Jul 15, 2026, 12.44 pm IST

Harish Rao | సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్‌కు (Revanth Reddy) హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ అని హెల్త్ కార్డుల (Health Cards) విషయంలో మరోసారి నిరూపితమైంద‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (Employees Health Scheme) విషయంలో రేవంత్ స‌ర్కార్ తీరు కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుంద‌న్నారు. బుధ‌వారం నుంచి హెల్త్ కార్డుల పంపిణీ అన్న ప్ర‌భుత్వ హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. డేట్లు, డెడ్లైన్లు మారుతున్నాయి తప్ప హెల్త్ కార్డులు జారీ చేయడం లేదని మండిప‌డ్డారు. రెండు నెలల ప్రీమియం వసూలు చేసి, పథకం అమలు చేయకుండా ఉండటం మోసం చేయడమేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు, ఈరోజు నుంచే ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పిన మాటలు జూటా అని తేలిపోయిందన్నారు.

పిల్ల పుట్టక ముందే..

పథకం అమలుకు మార్గదర్శకాల విడుదల లేదు, నెట్ వర్క్ ఆసుపత్రులతో సంతృప్తికరమైన ఒప్పందం లేద‌ని చెప్పారు. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లు, పథకం అమలు చేయకుండానే రెండు నెలలుగా ఉద్యోగులు జీతం, పెన్షన్ల నుంచి 1.5శాతం కోత విధించిన సర్కారు.. పథకం అమలులో మాత్రం చేతులెత్తేసిందని మండిప‌డ్డారు. అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఇచ్చిన హామీ 30 నెలలు గడుస్తున్నా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో అన్ని రకాల జబ్బులకు, అన్ని ద‌వాఖాన‌ల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తాం అన్న మాట నిలబెట్టుకోవడానికి ఇంకెంత సమయం కావాల‌ని నిల‌దీశారు.

నిర్లక్ష్యానికి నిదర్శనం..

`ముందు జూన్ 2 నుంచి హెల్త్ స్కీం అమలు చేస్తామ‌న్నారు, తర్వాత జూలై 15 నుంచి అన్నరు. తీరా చూస్తే అతీ లేదు గతీ లేదు. డేట్లు, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప ఇచ్చిన హామిని మాత్రం నిలబెట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటులో, అభివృద్దిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్రను గుర్తించిన కేసీఆర్‌ (KCR) రెండుసార్లు పీఆర్సీ, 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి గౌరవించారు. పెన్షనర్ల వయస్సు పెరుగుతున్నా కొద్దీ వారి అవసరాలు తీరేలా పెన్షన్ పెంచారు. ఒక్క రూపాయి తీసుకోకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లకు వెల్‌నెస్ సెంటర్లు, ఇతర ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన వైద్య సేవలుందించారు. 1శాతం బేసిక్ పేతో మరింత పటిష్టంగా ఉద్యోగుల హెల్త్ స్కీం రూపొందించేందుకు గాను బీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

పీఆర్సీ, డీఏల జాడే లేదు..

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి రాగానే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లపై ఏమాత్రం కనికరం లేకుండా 1.5శాతం కోత విధిస్తున్నది. 30 నెలలు గడిచింది పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, ఆరు డీఏల జాడే లేదు. సీపీఎస్ రద్దు ఊసే ఎత్తడం లేదు. మరోవైపు పెన్షన్ బకాయిల అందక మానసిక వ్యథతో రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు. మలి వయస్సులో పోరాటం చేయాల్సిన దుస్థితి కల్పించావు. ఆసుపత్రులకు నిధులు చెెల్లించకుండా పోలీసులకు భద్రత పథకాన్ని అటకెక్కించావు. జర్నలిస్టుల (Journlists) హెల్త్‌ కార్డులను గాలికి వదిలేసి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రశ్నార్థకం చేశావు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువున్నాయని విద్యా కమిషన్‌తో (Vidya Commission) చెప్పించావు, మొన్న రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నావు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత పగబట్టినట్లు వ్యవహరిస్తున్నావు రేవంత్ రెడ్డి?. ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో లేదంటే వారి పక్షాన బీఆర్‌ఎస్ (BRS) పోరాటానికి సిద్ధం అవుతుందని హెచ్చరిస్తున్నాం. హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని, పథకం అమలు చేయకుండా కోత విధించిన డబ్బులను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని` హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement