Errolla Srinivas | పైరవికారులు, దళారుల పాలనలా మారిన ప్రజా పాలన: ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas | ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ కోర్టు ధిక్కరణకు (Contempt of Court) పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) విమర్శించారు. ఇందిరమ్మ పాలన (Indiramma Palana) అంటే జీవోలను దాచిపెట్టడమా అని ప్రశ్నించారు. ప్రజా పాలన కాస్త పైరవికారుల పాలన, దళారుల పాలనలా మారింది.
Errolla Srinivas | త్రినేత్ర.న్యూస్: ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ కోర్టు ధిక్కరణకు (Contempt of Court) పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) విమర్శించారు. ఇందిరమ్మ పాలన (Indiramma Palana) అంటే జీవోలను దాచిపెట్టడమా అని ప్రశ్నించారు. ప్రజా పాలన కాస్త పైరవికారుల పాలన, దళారుల పాలనలా మారింది. కేసీఆర్ (KCR) హయాంలో జీవోలను దాచిపెడుతున్నారని గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇప్పుడు చేస్తున్నదేండని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. `2023 డిసెంబర్ 07 నుంచి 2025 జనవరి 25 వరకు ఈ ప్రభుత్వం 19,064 జీవోలు జారీచేసింది. పబ్లిక్ డొమైన్‌లో పెట్టింది మాత్రం 3,290 జీవోలే. 15,74 జీవోలను ఈ ప్రభుత్వం దాచిపెట్టింది. అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కోర్టు వెళ్లాం. 8 వారాల్లో అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. కోర్టులు అంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. అందుకే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మళ్లీ పిటిషన్ దాఖలు చేశాం. ఆనాడు కేసీఆర్ హయంలో జీవోలను దాచి పెడుతున్నారని గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇందిరమ్మ పాలన అంటే జీవోలను దాచిపెట్టడమా?` అని ప్రశ్నించారు.
జీవోలను మాయం చేశారు..
ప్రతి జీవోను పబ్లిక్ డొమైన్‌లో (Public Domain) పెట్టాలంటూ కేసీఆర్ 2015లో జీవో 04 తెచ్చారు. ఈ ప్రభుత్వంలో ఎస్సీ శాఖలో 259 జీవోలను తీస్తే 04, ఎస్టీ శాఖలో 266 జీవోలు తీస్తే 3 మాత్రమే, బీసీ శాఖలో 288 జీవోలు తీస్తే 88, మైనార్టీ శాఖలో 155 జీవోలు తీస్తే కేవలం 2 మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఆ జీవోలనే దాస్తున్నది. జనరల్ డిపార్ట్‌మెంట్‌లో (GAD) 2,238 జీవోలు తీస్తే 89 మాత్రమే, ఆరోగ్య శాఖలో 1,048 జీవోలు తీస్తే ఒక్క జీవో మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు. విద్యా శాఖతో సహా వివిధ శాఖల జీవోలను మాయం చేశారు. జీవోలు మాయం కావడానికి గల కారణం ఏంటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం..
క్యాబినెట్ ర్యాంక్ లేనివారికి పదవులు కట్టబెడుతున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ (RR Tax) వసూలు చేసేందుకే వారిని పెట్టుకున్నారనే అనుమానం కలుగుతుంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోలను బయటపెట్టాలి. లేకపోతే ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు (Indiramma Rajyam).. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అవుతుంది. జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకపోతే కోర్టు ధిక్కరణ క్రింద జైలుకు వెళ్లేది అధికారులే. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. చీకటి దందా చేసే అధికారులే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అధికారుల భాగోతం ఏంటో అన్ని బయట పెడతాం. సచివాలయంలో ల్యాండ్ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్లకు జీవోలు తీస్తున్నారు.
పైరవికారులకు అడ్డగా సచివాలయం..
ప్రజా సంక్షేమం కోసం మంత్రుల పేషీలు పనిచెయ్యడం లేదు. జీవోలు ఎక్కడకి పోతున్నాయని అడిగే దమ్ము ఈ అసమర్థ మంత్రులకు అసలే లేదు. నేడు పైరవీకారులకు అడ్డగా సచివాలయం మారింది. ప్రజా పాలనా కాస్త పైరవికారుల పాలన, దళారుల పాలనలా మారింది. ఆర్టీఏ (RTA) చట్టం తెచ్చిన సోనియా గాంధీపై (Sonia Gandhi) అభిమానం ఉంటే.. ఆ చట్టాన్ని గౌరవించి అన్ని జీవోలను ఈ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోలను బయటపెట్టాలి. ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుంది.` అని విమర్శంచారు.
సంబంధిత వార్తలు

Manipur | మరోసారి భగ్గుమన్న మణిపూర్.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహనాలకు నిప్పు
జులై 15, 2026

Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె
జులై 15, 2026

Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
జులై 15, 2026
తాజావార్తలు
- ●Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె
- ●Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Nitin Gadkari | E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్రమే : నితిన్ గడ్కరీ
- ●Harish Rao | సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హరీశ్ రావు
- ●Income Tax Return | ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆదాయాలు ఇవే
- ●Vemula Prashanth Reddy | జైల్లో పెట్టినా కాంగ్రెస్ సర్కార్‌పై నా పోరాటం ఆగదు: వేముల ప్రశాంత్ రెడ్డి

Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె

Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Nitin Gadkari | E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్రమే : నితిన్ గడ్కరీ

Harish Rao | సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హరీశ్ రావు



