Rahul Gandhi | దేశ విద్యావ్యవస్థ దోపిడీ యంత్రాంగంగా మారింది.. ప్రక్షాళన చేయాలి : రాహుల్ గాంధీ
Rahul Gandhi | భారత్‌లో విద్యా వ్యవస్థ (Indias education system) నిజాయితీ లేని అవినీతి దోపిడీ యంత్రాంగంగా మారిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. విద్యావ్యవస్థలోని అవినీతి కారణంగానే పేపర్ లీక్ మాఫియా పుట్టుకొస్తోందని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi | ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు భారత్‌లో విద్యా వ్యవస్థ (Indias education system) నిజాయితీ లేని అవినీతి దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆరోపించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వ్యవస్థ.. అందుకు బదులుగా విద్యార్థులను, వారి కుటుంబాలను అప్పులు, మానసిక ఒత్తిడి, నిరాశలోకి నెడుతోందని ఆరోపించారు. దేశ విద్యా వ్యవస్థలో తక్షణమే విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన (Education Revolution) అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న సామాన్యుల దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా రాహుల్ పోస్టు పెట్టారు. వరుస పేపరల్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శించారు. విద్యావ్యవస్థలోని అవినీతి కారణంగానే పేపర్ లీక్ మాఫియా పుట్టుకొస్తోందని వ్యాఖ్యానించారు. ఇది లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. ఈ మాఫియా లక్షల మంది విద్యార్థులు ఏళ్లపాటు పడుతున్న కష్టాన్ని, వారి కలలను ఒక్క దెబ్బతో దోచుకుంటోందని ఆరోపించారు. తప్పు చేసిన సంస్థలకు టెండర్లు, అధికారులకు ప్రమోషన్లు లభిస్తున్నాయని.. శిక్ష మాత్రం తమ కలలను సాధించుకోలేక, ఒంటరిగా మిగిలిపోతున్న అమాయక విద్యార్థులకు పడుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా రంగంలో జరుగుతున్న అక్రమాలన్నీ తెలిసినా ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జవాబుదారితనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇప్పుడైనా దేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తనతో కలిసి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. దేశ విద్యా వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి ‘ఛాత్రోం కీ గూంజ్’ (Chhatron Ki Goonj) పేరిట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచారంలో చేరాలని విద్యార్థులను కోరారు. జులై 17న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగే రెండో విడత కార్యక్రమమానికి విద్యార్థులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
भ्रष्ट, अन्यायी, पक्षपाती, बेईमान - ये चार शब्द मेरे नहीं, ये देश के छात्र आज भारत की शिक्षा व्यवस्था के लिए इस्तेमाल कर रहे हैं।
और सच यही है - भारत की शिक्षा व्यवस्था अब एक बेईमान वसूली तंत्र बन चुकी है।
जो व्यवस्था बच्चों के भविष्य को तैयार करने के लिए बनी थी, वो आज उन्हें… pic.twitter.com/soeI7NNAEa
— Rahul Gandhi (@RahulGandhi) July 13, 2026
Also Read..
షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య
యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..
ప్రిన్సిపాల్స్ 'ఈగో' వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య
- ●AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..
- ●Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం
- ●KGBV Sangareddy Protest | ప్రిన్సిపాల్స్ 'ఈగో' వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!
- ●Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్రస్టు.. అర్హతలు ఇవే
- ●Sreeleela | ఎస్ఎస్ఎస్ - శ్రీలీల డ్రీమ్బాయ్లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనట!

Shabad Rajkumar Suicide | షాబాద్ ‘సైకో కిల్లర్’ మృతి.. మేనమామ ఊరిలో ఆత్మహత్య

AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..

Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుదల చేశాం

KGBV Sangareddy Protest | ప్రిన్సిపాల్స్ 'ఈగో' వార్.. నడిరోడ్డుపై 200 మంది విద్యార్థినుల కన్నీటి ధర్నా!






